రైల్వే స్టేషన్ ఎదుట కాంగ్రెస్ ధర్నా
== అధిక సంఖ్యలో పాల్గొన్న కాంగ్రెస్ శ్రేణులు
== పార్టీ ఆపీస్ నుంచి భారీ ర్యాలీ.. అడ్డుకున్న పోలీసులు
== పోలీసులకు కార్యకర్తలకు తోపులాట
== కార్యకర్తలకు స్వల్ప గాయాలు
== వర్షంను సైతం లెక్కచేయని కాంగ్రెస్ శ్రేణులు
== నిండు వర్షంలోనే నిరసన
== ధర్నాలో హాజరైన వీహెచ్
ఖమ్మంప్రతినిధి, జులై 22(విజయంన్యూస్)
ఖమ్మంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమం స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది.. ఖమ్మంజిల్లా పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా రైల్వేస్టేషన్ కు వస్తున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో, పోలీసులకు, పార్టీ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో నలుగురు పార్టీ నాయకులకు స్వల్పగాయాలైయ్యాయి. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఒక వైపు నిండు వర్షం.. మరో వైపు పోలీసుల ఉక్కుపాదం.. అయినప్పటికి కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమం సక్సెస్ అయ్యింది.
ALLSO READ- దారి చూపని ధరణి.. మాకేందుకు అంటున్నజనం
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పై వీడి వేధింపులు నిరసిస్తూ ఎఐసిసి ఆదేశానుసారం, టీపిసిసి పిలుపు మేరకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు దుర్గాప్రసాద్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావిద్ ఆధ్వర్యంలో నగరంలో శుక్రవారం రైల్వే స్టేషన్ వద్ద భారీ ధర్నాను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ పార్లమెంట్ సభ్యులు వి. హనుమంతరావు పాల్గొన్నారు. ముందుగా జిల్లా కాంగ్రెస్ కార్యాలయం నుండి రైల్వే స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు.
== కేంద్రప్రభుత్వంపై మండిపడిన వీహెచ్
ఈ సందర్భంగా వి హనుమంతరావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధినాయకత్వంపై మోడీ ప్రభుత్వం చేస్తున్న దాడులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో జనతా ప్రభుత్వం ఇందిరాగాంధీ పై తప్పుడు కేసులు పెట్టి జైలు పాలు చేయాలని చూస్తే అనాతి కాలంలోనే ప్రజలు తిరగబడి జనతా ప్రభుత్వాన్ని మట్టి కల్పించారని గుర్తు చేశారు. జనతా ప్రభుత్వానికి పట్టిన గతే నేడు బిజెపికి అదేగతి పట్టడం ఖాయమని పలికారు. డిమాండ్లైజేషన్ పేరుతో నల్లధనం తీసుకొస్తానన్న మోడీ ఇప్పటివరకు ఎంత నల్లధనం తీసుకొచ్చాడో చెప్పాలని డిమాండ్ చేశారు. జీఎస్టీ పేరుతో వేస్తున్న పన్నులకు సామాన్యులు బతికే పరిస్థితులు లేవని మండిపడ్డారు. భారతదేశం సెక్యులర్ దేశమని ఇలాంటి దేశాన్ని హిందూ దేశంగా మార్చాలని బిజెపి కుట్ర చేస్తుందని ఇట్లాంటి కుట్రలు కుతంత్రాలకు ప్రజలు గుణపాఠం చెబుతారని అన్నారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీని అనగా తొక్కి కాంగ్రెస్ ను పిండి చేయాలని చూసి మోడీకి పతనం తప్పదని హెచ్చరించారు. అనంతరం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ…
ALLSO READ- భద్రాద్రిని కాపాడిందేవరు..?
గొప్ప గొప్ప మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన బిజెపి మాటలు నిలబెట్టుకోవడంలో విఫలం చెందిందని విమర్శించారు. మోడీకి గాంధీ కుటుంబాన్ని వేదించడం పై ఉన్న ఆసక్తి ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడంలో లేదని ఆరోపించారు. అధికారంలోకి వస్తే వంద రోజుల్లోనే నల్లధనం తీసుకువచ్చి ప్రజల ఖాతాలోకి వేస్తానని 8ఏళ్లవుతున్న నయా పైసా వేయలేదని అన్నారు. పైగా జీఎస్టీ పేరుతో ప్రజల జేబులకు చిల్లు పెడుతున్నారని విమర్శించారు.నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్ మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వ తీరుకు టీపీసీసీ పిలుపుమేరకు శాంతియుతంగా ధర్నా చేస్తున్న తమపై రాష్ట్ర పోలీసులు దాడి దాడి చేయడం పలు రకాల అనుమానాలకు తావిస్తుందని మండిపడ్డారు. కేంద్రాల మోడీ చేస్తున్న అవినీతి అక్రమాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వత్తాసు పలుకుతుందని దీనికి నేడు జరిగిన ఘటన నిదర్శనమని ఆరోపించారు. నేడు రాష్ట్రంలో దేశంలో శాంతియుతంగా నిరసన తెలియజేసే పరిస్థితి లేదని వాపోయారు. పోలీసుల ఆధ్వర్యంలో అల్లర్లు సృష్టించి అక్రమ కేసులు బనాయించాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్టోబర్లో రాహుల్ గాంధీ మొదలుపెట్టనున్న జోడో భారత్ పాదయాత్రను అడ్డుకునేందుకు మోడీ ఈడీ కేసులతో బెదిరింపులకు పాల్పడుతున్నాడని విమర్శించారు. ఈ దద్దమ్మ బెదిరింపులకు కాంగ్రెస్ అధినాయకత్వం భయపడదని హెచ్చరించారు. విచారణకు తమ అధినేత్రి సోనియాగాంధీ ఆరోగ్యం బాగో లేకపోయినా ఎంతసేపు విచారించిన నేను సహకరిస్తానని చెబుతున్నప్పటికీ రోజుకు రెండు గంటలు విచారించి మరల తిరిగి రేపురా అని తిప్పించుకోవడం దుర్మార్గమని అన్నారు. ఇదంతా ప్రజలు చూస్తూనే ఉన్నారని త్వరలోనే బిజెపిని గద్ద దించడానికి ప్రజలు కంకణం కట్టుకున్నారని అన్నారు.నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్ మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వ తీరుకు టీపీసీసీ పిలుపుమేరకు శాంతియుతంగా ధర్నా చేస్తున్న తమపై రాష్ట్ర పోలీసులు దాడి దాడి చేయడం పలు రకాల అనుమానాలకు తావిస్తుందని మండిపడ్డారు.
ALLSO READ- సత్తుపల్లిలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా
కేంద్రాల మోడీ చే స్తున్న అవినీతి అక్రమాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వత్తాసు పలుకుతుందని దీనికి నేడు జరిగిన ఘటన నిదర్శనమని ఆరోపించారు. నేడు రాష్ట్రంలో దేశంలో శాంతియుతంగా నిరసన తెలియజేసే పరిస్థితి లేదని వాపోయారు. పోలీసుల ఆధ్వర్యంలో అల్లర్లు సృష్టించి అక్రమ కేసులు బనాయించాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్టోబర్లో రాహుల్ గాంధీ మొదలుపెట్టనున్న జోడో భారత్ పాదయాత్రను అడ్డుకునేందుకు మోడీ ఈడీ కేసులతో బెదిరింపులకు పాల్పడుతున్నాడని విమర్శించారు. ఈ దద్దమ్మ బెదిరింపులకు కాంగ్రెస్ అధినాయకత్వం భయపడదని హెచ్చరించారు. విచారణకు తమ అధినేత్రి సోనియాగాంధీ ఆరోగ్యం బాగో లేకపోయినా ఎంతసేపు విచారించిన నేను సహకరిస్తానని చెబుతున్నప్పటికీ రోజుకు రెండు గంటలు విచారించి మరల తిరిగి రేపురా అని తిప్పించుకోవడం దుర్మార్గమని అన్నారు. ఇదంతా ప్రజలు చూస్తూనే ఉన్నారని త్వరలోనే బిజెపిని గద్ద దించడానికి ప్రజలు కంకణం కట్టుకున్నారని
అన్నారు. ఈ కార్యక్రమంలోజిల్లా కాంగ్రెస్ నాయకులు రాయల నాగేశ్వరావు, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిది వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, జిల్లా ఓబీసీ సెల్ అధ్యక్షుడు పుచ్చకాయల వీరభద్రం, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మొక్క శేఖర్ గౌడ్, ఐఎన్టీయుసీ జిల్లా అధ్యక్షుడు కొత్త సీతరాములు, మహిళ జిల్లా అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు యడ్లపల్లి సంతోష్,ఎన్ఎస్ యుఐ జిల్లా అధ్యక్షుడు పగినాటి ఉదయకుమార్, రాష్ట్ర ఎస్టీ సెల్ ఉపాద్యక్షులు మాలోత్ రాందాస్ నాయక్, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు బొడ్డు బొందయ్య, నాయకులు తోటకూర రవిశంకర్, వనం ప్రదీప్ చక్రవర్తి(బాబు), ఖమ్మం రూరల్ మండల అధ్యక్షుడు కళ్ళెం వెంకటరెడ్డి, కొణిజర్ల మండల అధ్యక్షుడు వడ్డె నారాయణరావు,ఎర్రుపాలెం మండల కాంగ్రెస్ అద్యక్షులు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి, వేంసూరు మండల అధ్యక్షుడు కాసర చంద్రశేఖర్ రెడ్డి, కూసుమంచి మండల అధ్యక్షుడు మట్టె గురవయ్య, మధిరమండల అధ్యక్షుడు సూరంశెట్టి కిషోర్, ఖమ్మం కార్పోరేటర్లు దుద్దుకూరి వెంకటేశ్వర్లు, లకావత్ సైదులు నాయక్, జడ్పీటీసీలు బెల్లం శ్రీనివాసరావు, బాణోత్ ప్రవీణ్ కుమార్, నాయకులు చోటా బాబా, బాణాల లక్ష్మణ్, పొదిలహరినాద్ బాబు, ఎర్రబోలు శ్రీనివాసరావు, సంపటం నర్సింహారావు, భూక్యా సురేష్, బాణోత్ శంకర్ నాయక్, బోడా వెంకన్న, బాణోత్ బాబు, కన్నెటి వెంకటేశ్వర్లు, బి. ఉద్దండయ్య, భూక్యా సురేష్, ఆరివికట్ల ప్రవీణ్ కుమార్, తలారి నాగభూషణం, అమరనేని బాబురావు, జంగం లక్ష్మీనారాయణ, యస్ కె జహిర్, మనం మణికంఠ, యస్.కె. హుస్సెన్, గజ్జి సూర్యనారాయణ, అవిడబోయిన రవీంధర్, వేణు, అంజని, రామయ్య, వెంపటి నాగేశ్వరరావు, రవికుమార్, బండారు నర్సింహారావు, యస్.కె. జాని, సూరంశెట్టి రాజేష్, పి నాగిరెడ్డి. కె.ప్రసాద్, పి.శ్రీను తదితర నాయకులు పాల్గొన్నారు.