Telugu News

తొలగించిన విగ్రహాలను వాటి స్థానంలో వెంటనే పునః ప్రతిష్టించాలి.

విలేకర్ల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నేతల డిమాండ్

0

తొలగించిన విగ్రహాలను వాటి స్థానంలో వెంటనే పునః ప్రతిష్టించాలి.
== విలేకర్ల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నేతల డిమాండ్
(ఖమ్మం ప్రతినిధి-విజయంన్యూస్)
తొలగించిన స్థలంలోనే మహానీయుల విగ్రహాలను పున:ప్రతిష్టించాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ప్రభుత్వాన్ని, ప్రభుత్వాధికారులను డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోని సంజీవర్ రెడ్డి భవనంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఖమ్మం కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు మొహమ్మద్ జావిద్, ఎంబీసీ జిల్లా నాయకులు వడ్డెబోయిన నర్సింహారావులు మాట్లాడుతూ పాత వరంగల్ జిల్లా విడిపోయిన తర్వాత రాజకీయంగా పేగుబంధం ఉన్నటువంటి అనేక ఉద్యమాలు పోరాటాలు చేసినటువంటి ఉద్యమాల గడ్డ ఖమ్మం నగరం అన్నారు.
సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, టీ డీ పీ పార్టీలు అనేక సంవత్సరాలు పరిపాలన సాగించి వారు చేసినటువంటి పోరాటాలకు , ఉద్యమాలకు గుర్తులుగా జెండాలు , రాజకీయ నాయకుల విగ్రహాలు దేశ నాయకుల విగ్రహాలను వాళ్ల వాళ్ల ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకోవడం జరిగిందని తెలిపారు. తెరాస ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగపరంగా, నీటి పరంగా తెలంగాణ ప్రభుత్వం ద్వారా వచ్చే సంపాదన సమానం గా పంచాలని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఆపాత గుర్తులను మొత్తాన్ని తొలగించి ఖమ్మం నగరాన్ని వారు కొత్తగా నిర్మించారన్నట్టుగా టీఆర్ఎస్ పార్టీ చిత్రీకరిస్తుందని ఆరోపించారు. ఈ ప్రక్రియలో భాగంగా సిపిఐ, సిపిఎం గద్దెలనే కాకుండా కొంతమంది ఉన్నతమైన వ్యక్తులు విగ్రహాలను తొలగిస్తుందని, స్థానిక గాంధీ చౌక్ బోస్ బొమ్మ సెంటర్ లో స్వతంత్ర సమరయోధుల విగ్రహాల ను తొలగించి వాళ్లకు నచ్చిన విగ్రహాలను ప్రతిష్టించారని ఆరోపించారు. రోడ్లు విస్తరణ పేరిట విగ్రహాల ను తొలగించి ఆ విగ్రహాలను మరల పునర్నిర్మాణం చేస్తామని మునిసిపాలిటీ అధికారులు చెప్పి మాట తప్పతున్నారని గుర్తుచేశారు. అక్కడి ప్రాంతాల వాళ్లందరినీ మభ్యపెట్టి మరచిపోయేలా వ్యవహరిస్తున్నారని, దీనిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని, తక్షణమే ఆ విగ్రహాల ప్లేస్ లోనే తొలగించిన విగ్రహాలను ప్రతిష్టించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు మలీదు వెంకటేశ్వరరావు, నిరంజన్, నాయకులు మిక్కిలేని నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.

all so read :- వనమా రాఘవను అరెస్ట్ చేయాలి : భట్టి