Telugu News

గ్యాస్ ధరలు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నారు: కాంగ్రెస్..*

డబుల్ బెడ్ రూమ్ స్కామ్ లో అధికార పార్టీ నేతలున్నారు

0

*గ్యాస్ ధరలు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నారు: కాంగ్రెస్..*

*ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలు ఇవి*

*కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ళ దుర్గప్రసాద్*

*డబుల్ బెడ్ రూమ్ స్కామ్ లో అధికార పార్టీ నేతలున్నారు*

*సీఐడీకి ఈ కేసును అప్పగించి సమగ్రమైన విచారణ చేయించాలి*

*ఖమ్మం నగర అధ్యక్షుడు ఎండీ..జావిద్..*

ఖమ్మం ప్రతినిధి, జులై 7(విజయంన్యూస్)

గ్యాస్ ధరలను అమాంతంగా పెంచేస్తూ దేశ ప్రజల నడ్డి విరుస్తాన్నారని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ళ దుర్గప్రసాద్ ఆరోపించారు. కాంగ్రెసు పార్టీ జిల్లా కార్యాలయం సంజీవరెడ్డి భవన్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజల ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకుంటున్న బీజేపీ ప్రభుత్వం అనేక సార్లు గ్యాస్, పెట్రోల్ , డీజిల్ ధరలను పెంచుతూ ప్రజల జీవన స్థితిగతులపై భారం పడేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటికే పది సార్లు గ్యాస్ ధరలను పెంచిందని, ప్రస్తుతం మరో రూ.50 పెంచడం దుర్మార్గమని అన్నారు. ఇప్పిటికే నిత్యావసర ధరల పెంపుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజల నెత్తిన గ్యాస్ ధరల పెంపుతో గుదిబండ వేశారని పేర్కొన్నారు. ధరల పెంపును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని అన్నారు.

Allso read:- కూసుమంచి లో డబుల్ ఇండ్ల లబ్ధిదారుల ఆందోళన..

ఈ ధరలకు నిరసనగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని, ధరలను తగ్గించే వరకు పోరాటం చేస్తామని అన్నారు.
★★ ఖమ్మం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల స్కామ్ లో అధికార పార్టీ నేత పాత్ర: జావిద్

ఖమ్మం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల స్కామ్ లో అధికార పార్టీ నాయకుల పాత్ర ఉన్నట్లు ఖమ్మం నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎండీ జావిద్ ఆరోపించారు. ఇద్దరు మహిళలను ఆసరాగా తీసుకొని అధికారాన్ని అడ్డం పెట్టుకొని సుమారు 200 మంది సుమారు రెండు వందల మంది లబ్ధిదారులతో 5 కోట్ల రూపాయల వరకు వసూలు చేశారని ఇది అత్యంత సాధారణ విషయమని ఆయన పేర్కొన్నారు. ఖమ్మం డబుల్ బెడ్ రూమ్ స్కాం పై ఖమ్మం జిల్లా పోలీసులు దర్యాప్తు ను వేగవంతం చేయాల్సి ఉన్నప్పటికి చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, టీఆర్ఎస్ నాయకులను రక్షించే పనిలో పడ్డారని, అందుకే సీబీఐకీ ఈ కేసును అప్పగించాలని, తద్వారనే నిజనిజాలు బయటకు వస్తాయని అన్నారు. అలాగే ఎవరైతే బాధితులు ఉన్నారో వారందరికీ నఇందితులు తీసుకున్న డబ్బులను తిరిగి ఇప్పించాలని, లేదంటే కచ్చితంగా వారందరికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఒబిసి సెల్ జిల్లా అధ్యక్షుడు పుచ్చకాయల వీరభద్రం, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మొక్క శేఖర్ గౌడ్, ఎస్ సి సెల్ జిల్లా అధ్యక్షుడు బొడ్డు బొందయ్య, జిల్లా నాయకులు హుస్సేన్ గంగరాజుయాదవ్, రవి తదితరులు పాల్గొన్నారు.