ఇదేక్కడి న్యాయం..? కాంగ్రెస్ కార్పోరేటర్ల ఆగ్రహం
కార్పోరేటర్ ప్రతిపాధించిన వర్కులు కాకుండా టీఆర్ఎస్ నాయకులు ప్రతిపాధించిన వర్కులు పెడుతున్నారు
ఇదేక్కడి న్యాయం..? కాంగ్రెస్ కార్పోరేటర్ల ఆగ్రహం
== విధులు మావి.. పనులు వాళ్లకా..?
== కార్పోరేటర్ ప్రతిపాధించిన వర్కులు కాకుండా టీఆర్ఎస్ నాయకులు ప్రతిపాధించిన వర్కులు పెడుతున్నారు
== మేయర్, కమీషనర్ కు వినతి చేసిన కార్పోరేటర్లు
ఖమ్మం, జులై 5(విజయంన్యూస్)
కాంగ్రెస్ పార్టీ కార్పోరేటర్ డివిజన్లలో మంజూరు అయిన బడ్జెట్ కు కార్పోరేటర్ ప్రతిపాధించిన పనులు కాకుండా అధికారి పార్టీ (టి.ఆర్.యస్) డివిజన్ అధ్యక్షులు ప్రతిపాధించిన వర్క్స్ మాత్రమే మంజూరు చేయుడమేంటని, కార్పోరేటర్లను అవమానపరుస్తున్నారని కాంగ్రెస్ కార్పోరేటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పోరేటర్లు ఖమ్మం నగర మేయర్ పూనకొల్లు నీరజ, కార్పోరేషన్ కమీషనర్ అదర్స్ కు వినతిప్రతాన్ని అందించారు. ఈ సందర్భంగా కార్పోరేటర్లు మాట్లాడుతూ ఖమ్మం నగర మేయర్, అధికారులు కాంగ్రెస్ కార్పోరేటర్లపై చిన్నచూపు చూస్తున్నారని, ఇది సరైన పద్దతి కాదని అన్నారు.
ALLSO READ- ఫారెస్ట్ అధికారులు మాపై దాడి చేశారు : రైతులు
రాజ్యంగబద్ధంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికై ఉన్నమని, కానీ అధికార పార్టీకి చెందినటువంటి మేయర్ కొంత మంది అధికారులు అధికారపార్టీ చెప్పిన విధంగా వ్యవహిరిస్తూ డివిజన్ అభివృద్ధికి 45 లక్షల బడ్జెట్ నందు మేము ప్రతిపాదించిన పనులను కాకుండా డివిజన్ కు చెందిన అధ్యక్షులు, నాయకులకు చెప్పిన పనులను మంజూరు చేస్తుండటం విడ్డూరమని అన్నారు. ప్రజల చేత ప్రజాస్వామ్య, పద్ధతిలో ఎన్నికోబడిన మా కార్పోరేటర్ల గౌవరవాన్ని, మా మనోభావలను కించపర్చే విధంగా వ్యవహరిస్తున్నారని, ఈ విధంగా రాజ్యంగా బద్దంగా ఎన్నుకోన్న ప్రజాప్రతినిధులను అవమాపర్చే విధంగా విలువలను తగ్గించి చేయడం మంచి సంప్రదాయం కాదన్నారు. పట్టణ ప్రగతిలో కూడా మా కార్పోరేటర్ల కాదు అని రాజ్యంగ విరుద్ధంగా అధికార పార్టీ నాయకులకు జె.సి.బి. ట్రాక్టర్లు అధికారులు ఇవ్వడం జరిగిందని అన్నారు. ఇట్టి విషయంపై అధికారులకు తెలియపరిచిన అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకుండా మా మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్నారని, తగిన మూల్యం చేల్లించాల్సి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో 54 వ డివిజన్ మున్సిపల్ కాంగ్రెస్ కార్పొరేటర్ మిక్కిలినేని మంజుల, 49 వ డివిజన్ కార్పొరేటర్ ఎండి రఫీ బేగం, 49 వ డివిజన్ కార్పొరేటర్ దుద్దుకూరు వెంకటేశ్వర్లు, రెండో డివిజన్ కార్పొరేటర్ మలీద్ వెంకటేశ్వర్లు, 8 వ డివిజన్ కార్పొరేటర్ సైదులు నాయక్, మరియు కార్పొరేటర్ దొంగల సత్యనారాయణ, దొడ్డ నగేష్ మరియు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ జిల్లా నాయకులు మిక్కిలి నరేందర్, ఎం డి ముస్తఫా, కొప్పెర ఉపేందర్, పల్లె బోయిన చంద్రం, ఎస్కే సర్దార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ALLSO READ- తెగబడిన ఇసుక మాఫియా*