Telugu News

ఖమ్మంలో తొలి ఓమిక్రాన్ కేసు నమోదు..?

ఖమ్మం వైరా రోడ్ CRG ఏరియాలో ఓమిక్రాన్ కేసు*

0

*ఖమ్మంలో తొలి ఓమిక్రాన్ కేసు నమోదు..?

*** ఖమ్మం వైరా రోడ్ CRG ఏరియాలో ఓమిక్రాన్ కేసు*

** ఉలిక్కిపడిన ఖమ్మం
(ఖమ్మం ప్రతినిధి-విజయం న్యూస్)
ఖమ్మం జిల్లాలో ఓమిక్రాన్ కేసు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఖమ్మం నగరంలోని కోర్టు సమీపంలో ఉన్న సిఆర్ జీ టవర్ సమీపంలో నివాసం ఉంటున్న ఒక యువతికీ ఓమిక్రాన్ కేసు నమోదు అయినట్లు సమాచారం తెలుస్తుంది. ఖమ్మం నగరంలోని సీఆర్ జీ టవర్స్ ఏరియాలో నివాసం ఉంటున్న ఓ యువతి చదువుల నిమిత్తం కెనడాకు వెళ్ళగా గత నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ వచ్చింది. హైదరాబాద్ వచ్చిన నాటి నుంచి జ్వరం, దగ్గు వస్తుండటంతో కరోనా టెస్ట్ చేయింతగా పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. ఈ మేరకు అక్కడ వైద్యులు, అధికారులు ఓమిక్రాన్ లక్షణాలు ఉన్నాయనే ఆలోచనతో నమూనాలను సేకరించి పరీక్ష లకు పంపించినట్లు సమాచారం. కాగా ఆ యువతి ఖమ్మం వచ్చి ఈనెల 19న ఖమ్మం ప్రభుత్వాసుత్రిలో మరోసారి కరోనా టెస్టులు చేయించుకోగా పాజిటీవ్ రావడం.. ఓమిక్రాన్ లక్షణాలు ఉన్నట్లు కనిపించడంతో ఖమ్మం వైద్యులు నమూనలనూ పరీక్షల నిమిత్తం హైదరాబాద్ కు తరలించారు. కాగా తన ఇంట్లో ఉంటూ రెస్ట్ తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే ఆదివారం రిపోర్ట్ లో ఓమిక్రాన్ లక్షణాలు ఉన్నట్లుగా పాజిటివ్ గా నమోదైనట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆ ఏరియాలో ప్రచారం ఊపందుకోగా.. ఆ ఏరియా వారంత అప్రమత్తమైయ్యారు. అయితే ఆ యువతికి ఓమిక్రాన్ వచ్చిందా.. లేదంటే ప్రచారమేనా.. తెలియాల్సి ఉంది. ఆ విషయంపై ఇప్పటికే వైద్యాధికారులు ఎంక్వైరీ చేస్తున్నట్లు సమాచారం. కాగా జిల్లా అధికారులు అప్రమత్తమైనట్లు తెలుస్తోంది.. ఆమె ఎవరేవరితో తిరిగింది.. ఎవర్ని కలిసింది.. ఎక్కడ నివాసం ఉంది అనే వివరాలను సేకరించి వారందరికీ పరీక్షలు చేసే అవకాశం లేకపోలేదు. అయితే ఖమ్మంలో ఇదే మొదటి ఓమిక్రాన్ కేసు. రాష్ట్రంలో ఈ ఒక్క రోజు మూడు ఓమిక్రాన్ కేసులు నమోదూ కాగా, మొత్తం ఇప్పటి వరకు 44కేసులు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు.

all so read :- కూసుమంచి పెట్రోల్ బంక్ లో వినియోగదారుల ఆందోళన..*