Telugu News

ముదిగొండ కాంగ్రెస్ ఫ్లీనరీ.. హాజరైన సీఎల్పీ నేత భట్టి..

పూలవర్షంతో స్వాగతం పలికిన కాంగ్రెస్ నేతలు..

0

ముదిగొండ కాంగ్రెస్ ఫ్లీనరీ.. హాజరైన సీఎల్పీ నేత భట్టి..

— పూలవర్షంతో స్వాగతం పలికిన కాంగ్రెస్ నేతలు..

(ముదిగొండ-విజయం న్యూస్)

ముదిగొండ మండలం చిరుమర్రి గ్రామంలో బుధవారం జరిగిన కాంగ్రెస్ పార్టీ మండల మూడవ ప్లీనరీ సమావేశానికి తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత, మధిర శాసన సభ్యులు మల్లు భట్టి విక్రమార్క ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, గ్రామ ప్రజలు భట్టి విక్రమార్కకి మంగళ హారతులు, డప్పు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. గ్రామంలోని మహనీయులు అంబేద్కర్, స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి విగ్రహాలకు భట్టివిక్రమార్క పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు భారీ ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా కార్యకర్తలు దారి పొడవునా భట్టి విక్రమార్క పై పూలవర్షం కుమ్మరిస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కొమ్మినేని రమేష్ బాబు అధ్యక్షతన ప్లీనరీ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి జిల్లా పార్టీ అధ్యక్షుడు పువ్వాళ్ళ దుర్గప్రసాద్, జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులు.. ప్రజాప్రతినిధులు హాజరైయ్యారు..

allso read :- సలీమా కు సెల్యూట్.. ఐపీఎస్ గా  పదోన్నతి