Telugu News

విజన్ ఉన్న నేత కేసీఆర్: మాజీ ఎంపీ పొంగులేటి

జిల్లాలోని పలు మండలాల్లో మాజీ ఎంపీ విస్తృత పర్యటన

0

విజన్ ఉన్న నేత కేసీఆర్: మాజీ ఎంపీ పొంగులేటి
– పలు శుభకార్యాలలో పాల్గొన్న మాజీ ఎంపీ పొంగులేటి
– జిల్లాలోని పలు మండలాల్లో మాజీ ఎంపీ విస్తృత పర్యటన
– నూతన షాట్లను ప్రారంభించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి
– వధూవరులకు నూతన వస్త్రాల బహుకరణ – కార్యకర్తల కుటుంబాలకు పరామర్శ, ఆర్ధిక సహాయం
(ఖమ్మంప్రతినిధి- విజయంన్యూస్)
అభివృద్ధి, సంక్షేమ పథకాలను జోడు గుర్రాలుగా పరిగెత్తిస్తూ రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో ముందుకు తీసుకెళ్తున్న విజన్ ఉన్న నేత సీఎం కేసీఆర్ అని మాజీ ఎంపీ, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొనియాడారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతితో రాష్ట్ర రూపురేఖలే మారిపోయాయన్నారు. శుక్రవారం జిల్లాలోని ఖమ్మం రూరల్, ఖమ్మం పట్టణం, తల్లాడ, మధిర, ఎర్రుపాలెం మండలాల్లో మాజీ ఎంపీ పర్యటించారు. ఆయా మండలాల్లో జరుగుతున్న పలు వివాహ, శుభకార్యాలలో పాల్గొని దంపతులన ఆశీర్వదించారు. అలాగే ఇటీవల గాయపడిన, ఆనారోగ్యానికి గురైన, మరణించిన పలు కుటుంబ సభ్యులను ఓదార్చి, మనోధైర్యం కల్పించి ఆర్ధిక సహాయంను అందజేశారు.

ఖమ్మం : ఖమ్మం పట్టణం బైపాస్ రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన తేజ ట్రేడర్స్ ఆండ్ సర్వీస్ షాప్ ను ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ మువ్వా విజయ్ బాబు, సత్తుపల్లి టీఆర్ఎస్ నాయకులు డాక్టర్ మట్టా దయానందు ప్రారంభించారు. రాపర్తి నగర్ లో నల్లా కృష్ణారెడ్డి నూతంగా ఏర్పాటు చేసిన హెటల్ ను మాజీ ఎంపీ పొంగులేట, స్థానిక కార్పోరేటర్ దోరేపల్లి స్వేతలు ప్రారంభించారు. ఖమ్మం క్యాంప్ కార్యాలయంలో జూలూరుపాడు మండలం కరివారిగూడెం గ్రామంలో గుడి నిర్మాణానికి తన వంతు సాయంగా రూ. 20 వేలను కమిటీ సభ్యులకు అందజేశారు.

ఇది చూడండి : -రాష్ట్ర కార్పొరేషన్లకు చైర్మన్లు వీరే..

లక్ష్మీ గార్డెన్స్ లో జరిగిన ఎర్రబోయిన గోవిందరావు కుమారుని వివాహమసూత్సవంలో పాల్గొని దంపతులను ఆశీర్వదించారు. శబరి గార్డెన్స్ లో కాటేపల్లి నాగేశ్వరరావు కుమారుని వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను దీవించి పట్టు వస్త్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు మలీదు జగన్, మోతారపు సుధాకర్, వైరా మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మా రోశయ్య, కొణిజర్ల ఎంపీపీ గోసు మధు, ఆకుల మూర్తి, ఒంటికొమ్ము శ్రీనివాసరెడ్డి, దుంపల రవికుమార్, రాధాకృష్ణ, భుక్య చంద్రు, షేక్ హిమామ్, చింతమళ్ల గురుమూర్తి, రామకృష్ణారెడ్డి, కాంపాటి రమేష్, నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.

రూరల్ : మారెమ్మ గుడి సమీపంలోని బొడ్డు వెంకటేశ్వర్లు కుమార్తె వివాహ మసూత్సవంలో, కొమరగిరి సుమన్ సోదరి వివాహ వేడుకలో మాజీ ఎంపీ, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించి పట్టు వస్త్రాలను అందజేశారు. అనంతరం పెద్దతండా గ్రామంలో బానోత్ లచ్చిరాం చనిపోయినందున ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చి మనోధైర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో అజ్మీరా అశోక్ నాయక్, మద్ది కిషోర్ రెడ్డి, మెండే వెంకటేష్, మాధవ్, పాప్యా నాయక్, వీరన్న, జాన్ రెడ్డి, బానోత్ కృష్ణ, హరి, యువనేత గోపి తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి : – సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన తాతామధు

తల్లాడ : శుక్రవారం తల్లాడ మండలంలో మాజీ ఎంపీ, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్ బాబు, టీఆర్ఎస్ జిల్లా నాయకులు డాక్టర్ మట్టా దయానంలు కేశ్వాపురం గ్రామంలో పున్నవల్లి నాగేశ్వరరావు కుమారుని వివాహ వేడుకలో, కుర్నవల్లి గ్రామంలో శీలం చలపతిరెడ్డి కుమారుని వివాహ రిసెప్షన్లో పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు. మన్నేపల్లి సీతమ్మ చనిపోయినందున ఆమె చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చి మనోధైర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో పొంగులేటి వెంట జక్కంపుడి కృష్ణవేణి, దుంపేడి వీరారెడ్డి, గణేషుల రవి,పొట్టేటి బ్రహ్మారెడ్డి పొట్టేటి తూము వెంకట నారాయణ, తూము నర్సింహరావు, పురుషోత్తం, వెంకటేశ్వర్లు, రాజారావు తదితరులు పాల్గొన్నారు.

ఇది చదవండి :- షేబాస్ రవి.. ఖమ్మంలో ఆటో డ్రైవర్ నిజాయితీ..2లక్షల విలువగల బంగారం అందజేత

మధిర : ఖమ్మం మాజీ ఎంపీ, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం మధిర మండలంలో పర్యటించారు. సిరిపురం గ్రామంలో కనకపూడి కరుణాకర్ కుమారుని వివాహ మహోత్సవంలో, మడుపల్ల శివాలయంలో జరిగిన వేల్పుల బుచ్చయ్య కుమారుని వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. పట్టణ కేంద్రంలో పల్లఖండ సత్యనారాయణమూర్తి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని దంపతులకు పట్టు వస్త్రాలను అందించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, కోట రాంబాబు, వేమిరెడ్డి లక్ష్మారెడ్డి, యన్నం కోటేశ్వరరావు, దేవిశెట్టి రంగారావు, మొండితోక సుధాకర్, సర్పంచ్ కనకపుడి పెద్దబుచ్చయ్య, కటికల సీతారామిరెడ్డి, చావల రామరాజు, వేల్పుల బుజ్జి, శీలం వీర వెంకట రెడ్డి, అయిలూరి ఉమామహేశ్వరి, పమ్మిశెట్టి బాలు, అక్కినేపల్లి నాగేశ్వరావు, జక్కంపూడి చంద్రశేఖర్, చిలకా సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

ఇది చదవండి :- ఆర్ డి వో లను సిడివొ లుగా మార్పు..? త్వరలోనే రెవెన్యూ లొ మరో ప్రక్షాళన