Telugu News

జీళ్ళచెరువులో వైభవంగా కోలాటం

అకట్టుకున్న చిన్నారుల కోలాటం

0

జీళ్ళచెరువులో వైభవంగా కోలాటం

** అకట్టుకున్న చిన్నారుల కోలాటం
(కూసుమంచి-విజయం న్యూస్)

కూసుమంచి మండలంలోని జీళ్ళచెరువు గ్రామంలోన సాయిశివాఆంజనేయ స్వామి దేవాలయంలో శనివారం కోలాట కార్యక్రమం వైభవంగా జరిగింది.. గత కొద్ది రోజులుగా జీళ్ళచెరువు గ్రామానికి చెందిన మహిళలలు, చిన్నారులు శ్రీ వెంకటేశ్వర కోలాట భజన మండలి ఆధ్వర్యంలో కోలాట మాస్టార్ శీలం పుల్లారెడ్డి కోలాటం నేర్చుకుంటుండగా శనివారం సాయిశివాంజనేయ దేవాలయంలో కోలాటం కార్యక్రమం వైభవంగా జరిగింది. ముందుగా ఆలయంలో పూజారి చిలకమర్రి స్వామినాథ్ ప్రత్యేకంగ పూజలు చేయగా సర్పంచ్ కొండా సత్యం, ఎంపీటీసీ అంబాల ఉమా శ్రీనివాస్, వార్డు సభ్యుడు, జర్నలిస్ట్ పెండ్ర అంజయ్య ప్రారంభించారు. సుమారు రెండు గంటల పాటు కోలాటం కార్యక్రమం జరిగింది. ఈకార్యక్రమానికి పెద్ద సంఖ్యలో జనం తరలి వచ్చి తిలకించారు. పెండ్ర అంజయ్య కోలాట బృందానికి స్నాక్స్ అందించారు..

*అందుకు సంబంధించిన కోలాట వీడియో..*