కారు అదుపుతప్పి ఇద్దరు దుర్మరణం.
**దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం
**ప్రమాదంలో మహిళ, బాలుడు మృతి
(కామేపల్లి – విజయం న్యూస్)
ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం నారాయణపురం గ్రామానికి చెందిన 8 మంది భక్తులు వీరబాబు, లక్ష్మయ్య, రేణుక, నాగమణి, భద్రమ్మ(45), వేదాంత్(9), మేఘవర్షిత, నరేష్ లు ములుగు లోని మేడారం సమ్మక్క సారాలమ్మ
అమ్మవార్లను దర్శించుకుని సొంత గ్రామానికి
తిరుగు ప్రయాణం అవుతున్న తరుణంలో ములుగు గట్టమ్మ సమీపంలోని మూలమలుపు తిరుగుతుండగా మామిళ్ల వద్ద కారు అదుపు తప్పి చెట్టును బలంగా ఢీకొట్టింది.
అంతలోనే అనుకోని ప్రమాదంలో ఇద్దరు చనిపోగా ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో భద్రమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. మేడారం భక్తులు, బాటసారులు 108 అంబులెన్స్ కు ఫోన్ ద్వారా సమాచారం అందించగా మిగిలిన ఏడుగురిని ములుగు జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో ఏటూరునాగారం సీఐ కిరణ్ కుమార్ హన్మకొండ వైపు వెళ్తూ ప్రమాదాన్ని గమనించి క్షతగాత్రులను అంబులెన్స్ లోకి ఎక్కించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని వరంగల్ ఎంజీఎంకు తరలించారు. చికిత్స పొందుతూ తొమ్మిదేళ్ల బాలుడు మృతిచెందాడు. మిగిలిన వారు ప్రస్తుతం ఎంజీఎంలో చికిత్స పొందుతున్నారు.