Telugu News

ప్రజా సమస్యల పరిష్కార వేధికగా ప్రతి వార్త ఉండాలి : ఎంపీపీ శ్రీనివాస్

"విజయం" పత్రిక, క్యాలేండర్ ను అవిష్కరించిన ఎంపీపీ, సీఐ, తహసీల్దార్, ఎంపీడీవో

0

ప్రజా సమస్యల పరిష్కార వేధికగా ప్రతి వార్త ఉండాలి : ఎంపీపీ

* *”విజయం” పత్రిక, క్యాలేండర్ ను అవిష్కరించిన ఎంపీపీ, సీఐ, తహసీల్దార్, ఎంపీడీవో

* *విజయం చైర్మన్ పెండ్ర అంజయ్యను అభినంధించిన అతిథిలు.

(కూసుమంచి-విజయం న్యూస్)

విజయం పత్రిక లో కథనాలు ప్రజలకు వారధిగా నిలవాలని, ప్రజా సమస్యల నిమిత్తం ప్రజల కోసం వార్తలు రాయాలని కూసుమంచి ఎంపీపీ బానోతు శ్రీనివాస్ నాయక్ సూచించారు. పత్రికలో కథనాలు ప్రజలకూ, ప్రభుత్వానికీ వారధిగా నిలవాలని కోరారు. సోమవారం కూసుమంచి మండల పరిషత్ కార్యాలయంలో
విజయం తెలుగు దినపత్రిక & క్యాలెండరు ను ఎంపీపీ కూసుమంచి బానోతు శ్రీనివాస్ నాయక్ అవిష్కరించారు. ఈ సంధర్భంగా చైర్మన్ పెండ్ర అంజయ్యను అభినంధించారు. మట్టిలో మాణిక్యం అంటే ఇలాగే ఉంటారని, చాలా గ్రౌండ్ లేవల్ ల్లో పనులు చేసుకుంటూ జర్నలిస్ట్ గా ఎన్నో కష్టనష్టాలను, అవమానాలను ఎదుర్కోని వెనుదిరగని దీరుడీగా ముందుకు సాగుతున్న పెండ్ర అంజయ్య, స్వంతంగా పత్రికను స్థాపించడం చాలా సంతోషకరమన్నారు. కష్టపడితే ఫలితం దక్కుతుందని, పెండ్ర అంజయ్య పోరాట స్పూర్తి ఎంతో మంది యువతకు అదర్శమని అన్నారు. సామాన్యులకు సింహస్వప్నంగా పత్రిక ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కరుణాకర్ రెడ్డి, ఎం పి ఓ రామచంద్ర రావు, సర్పంచ్ చెన్నా మోహన్ రావు, ఎంపీటీసీ మాదాసు ఉపేందర్, నేలకొండపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ వడ్తియా సెట్రామ్ నాయక్, మాజీ చైర్మన్ జూకూరి గోపాల్ రావు, మాజీ మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చాట్ల పరుశురాం గిరిజన సంఘం మండల అధ్యక్షుడు నెహ్రూ నాయక్, అర్వపల్లి జనార్ధన్, ఎండీ. రఫీ తదితరులు పాల్గొన్నారు.
also read ;-విజయం పత్రికను ప్రారంభించిన సీఎల్పీ నేత భట్టి

**విజయం పత్రికను అభినంధించిన కూసుమంచి సీఐ సతీష్

విజయం పత్రిక యజమాన్యం, జర్నలిస్ట్ లను కూసుమంచి సీఐ సతీష్ అభినంధించారు. కూసుమంచి పోలీస్ స్టేషన్ లోని తన చాంబర్ లో పత్రిక, క్యాలెండర్ ను ఆయన ప్రారంభించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ డిజిటల్ మీడియాగా ప్రారంభమైన విజయం తెలుగు దినపత్రిక ను ప్రింట్ గా మార్చి ప్రజలకు అందజేయడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు కొండ శ్రీనివాసరావు, కొమ్ము ప్రభాకర్ రావు,కొలికపొంగు సతీష్, రాయబారపు రమేష్, నాగిరెడ్డి రమేష్ రెడ్డి, బానోతు రమేష్, ఐతగాని ప్రభాకర్ తదితరులు హాజరైయ్యారు..

also read :-విజయం పత్రికకు అండగా ఉంటా: మాజీ ఎంపీ పొంగులేటి

** విజయం పత్రిక ప్రజల మన్ననలను పొందాలి : తహసీల్దార్
ప్రజా సేవలో మంచి పేరున్న సీనియర్ జర్నలిస్ట్ పెండ్ర అంజయ్య స్థాంపించిన “విజయం” తేలుగు దినపత్రిక ప్రజల మన్ననలను పొందాలని కూసుమంచి తహసీల్దార్ శిరీషా అకాంక్షించారు. కూసుమంచి రెవెన్యూ కార్యాలయంలో విజయం దినపత్రిక, క్యాలెండర్ ను తహసీల్దార్ అవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్ఐ లు వశీమ్, మూర్తి, సర్వేయర్ రవి, జూనియర్ అసిస్టెంట్ యాసిన్, ఖాజామోహినుద్దిన్, జర్నలిస్ట్ లు కొండా శ్రీనివాస్ రావు, కొమ్ము ప్రభాకర్ రావు, కొలికపొంగు సతీష, సీకే న్యూస్ చైర్మన్ భూక్య ఉపేందర్ తదితరులు హాజరైయ్యారు.