Telugu News

కూసుమంచి లో డబుల్ ఇండ్ల లబ్ధిదారుల ఆందోళన..

ఇండ్లను ఖాళీ చేయిస్తున్న అధికారులను అడ్డుకున్న లబ్ధిదారులు..*

0

*కూసుమంచి లో డబుల్ ఇండ్ల లబ్ధిదారుల ఆందోళన..*

*ఇండ్లను ఖాళీ చేయిస్తున్న అధికారులను అడ్డుకున్న లబ్ధిదారులు..*

*పోలీసుల రాకతో ఆగ్రహం..*

*ఖమ్మం-సూర్యపేట రహదారిపై రాస్తారోకో..*

కూసుమంచి, జులై 6(విజయం న్యూస్)

ఖమ్మం జిల్లా కూసుమంచి మండల కేంద్రంలోని డబల్ బెడ్ రూమ్ లబ్ధిదారులు గురువారం ఆందోళనకు దిగారు ఇటీవలే లబ్ధిదారులు అర్ధరాత్రి గృహప్రవేశాలు చేయగా బుధవారం రెవెన్యూ అధికారులు చేసే ప్రయత్నం చేశారు కాగా లబ్ధిదారులు రెవెన్యూ అధికారులను అడ్డుకున్న పోలీసులు ప్రవేశించి లబ్ధిదారులను లబ్ధిదారులు ఖమ్మం సూర్యాపేట రహదారిపై రాస్తారోకో నిర్వహించారు సుమారు గంట పాటు రాస్తారోకో చేయడంతో ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో కూసుమంచి లో ఉత్కంఠ నెలకొంది. అయితే సమాచారం అందుకున్న కూసుమంచి తహసీల్దార్ ఆందోళనకారులతో మాట్లాడుతూ వారంరోజులలో నిజమైన లబ్ధిదారులకు ఇండ్లను కేటాయిస్తామని హామినిచ్చారు. దీంతో లబ్ధిదారులు ఆందోళన విరమించారు.