Telugu News

ఖమ్మంలో మంకీపాక్స్ కలకలం

ఖమ్మం రూరల్ మండలం అరెంపుల గ్రానైట్ ప్యాక్టరీలో పనిచేస్తున్న వ్యక్తికి మంకీఫాక్స్

0

ఖమ్మంలో మంకీపాక్స్ కలకలం

== ఖమ్మం రూరల్ మండలం అరెంపుల గ్రానైట్ ప్యాక్టరీలో పనిచేస్తున్న వ్యక్తికి మంకీఫాక్స్..?

== ఖమ్మం ప్రైవేట్ ఆసుపత్రిలో వచ్చినట్లు ప్రచారం.?

== హైదరాబాద్ కు తరలింపు

== ఖమ్మం జిల్లాలో భయాందోళనలో ప్రజలు

== సందీప్ కు ఎలాంటి లక్షణాలు లేవు: డీఎంఅండ్ హెచ్వో

 

ఖమ్మం ప్రతినిధి, జులై 26(విజయంన్యూస్)

ప్రపంచాన్నే వణికిస్తున్న మంకీఫాక్స్ వ్యాధి ఖమ్మం వరకు చేరిందా..? ఇతర దేశాల్లో ఆ వ్యాధికి భయాందోళన గురువుతున్న తరుణంలో ఆ మహ్మామ్మారి వ్యాధి ఖమ్మంలో ఓ కార్మికుడికి సోకినట్లు ప్రచారం జరుగుతోంది.. ఈ మేరకు మంగళవారం ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు నిర్థారించినట్లు సమాచారం..? దీంతో ఖమ్మం జిల్లాలో కలకలం రేపింది. మంకీఫాక్స్ వ్యాధి సృష్టిస్తున్న అలజడికి యావత్తు ప్రపంచమే గజగజ వణికిపోతుంది. అయితే ఖమ్మంలో మాత్రం మంకీఫాక్స్ వ్యాధిని నిర్థారించే కేంద్రాలు లేకపోవంతో అతన్ని హైదరాబాద్ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.  అనేక అగ్రదేశాలనే మంకీఫాక్స్ వ్యాధి వణికిస్తోంది. దీంతో వరల్డ్ హెల్త్ అర్గనైజేషన్ హెల్త్ ఎమర్జేన్సిని ప్రకటించిన సంగతి తెలిసింది. ఈ మేరకు

ఇది కూడా చదవండి:- అరెంజ్ అలార్ట్ హెచ్చరిక

అందరు అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వాలు చోరవ తీసుకోవాలని సూచించిది. కాగా ప్రభుత్వాలు అప్రమత్తమవుతున్న తరుణంలోనే  ఆ వ్యాధి కాస్తా తెలంగాణ రాష్ట్రాని పాకినట్లే కనిపిస్తోంది.. మంగళవారం తెలంగాణ రాష్ట్రంలో రెండు కేసులు నమోదు కాగా, అందులో ఒక్కటి కామారెడ్డి జిల్లాలో కాగా, మరోక్కటి ఖమ్మం జిల్లాలో నమోదైనట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఖమ్మం జిల్లాలో మొదటి మంకీ ఫాక్స్ లక్షణాలు ఉన్న వ్యక్తి గుర్తించినట్లు సమాచారం. ఉత్తరప్రదేశ్ కి చెందిన సందీప్ అనే వ్యక్తి ఖమ్మం రూరల్ మండలం ఆరెంపుల గ్రానైట్ ఫ్యాక్టరీలో కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఆయన రెండు రోజులుగా జ్వరం వస్తుండటంతో ఆయన ఖమ్మం నగరంలోని పూజ హాస్పిటల్ లో చికిత్సకోసం వచ్చాడు. అక్కడ పరీక్షలు చేసిన వైద్యులు కచ్చితంగా మంకీఫాక్స్ వ్యాధి సోకినట్లు అనుమానించి, పరీక్షల కోసం రక్త నమూనాలను హైదరాబాద్ కు తరలించినట్లు తెలుస్తోంది. దీంతో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉక్కసారిగా ప్రజలు, అధికారులు, వైద్యులు ఉలిక్కిపడ్డైట్లంది.

== మంకీఫాక్స్ లక్షణాలు లేవు : డీఎంఅండ్ హెచ్వో

ఖమ్మం రూరల్ మండలం అరెంపుల గ్రానైట్ ప్యాక్టరీలో పనిచేస్తున్న సందీఫ్ కు ఎలాంటి మంకీ ఫాక్స్ లక్షణాలు లేవని ఖమ్మం జిల్లా డిఎంఅండ్ హెచ్ వో డాక్టర్ మాలతీ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో, మీడియాలో వస్తున్న కథనాలకు ఆమె స్పందించారు.  తప్పుడు సమాచారంతో సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయని, ఇది మంచి పద్దతి కాదన్నారు. మంకీ ఫాక్స్ లక్షణాలు లేవని, కార్మికుడు కాబట్టి అలాంటి దొద్దులు వచ్చినట్లు ఆమె తెలిపారు. ఎవరు భయపడాల్సి అవసరం లేదన్నారు.

ఇది కూడా చదవండి:- భద్రాచలం భవిష్యత్తేమిటి?