Telugu News

ఖమ్మం మార్కెట్ కు మోక్షం

రోల్ మోడల్ మార్కెట్ గా ఖమ్మం మార్కెట్

0

ఖమ్మం మార్కెట్ కు మోక్షం

== రైతన్న కల సాకారమవుతున్న వేళ

== == రోల్ మోడల్ మార్కెట్ గా ఖమ్మం మార్కెట్

== రూ.10.34 కోట్లతో ఖమ్మం మార్కెట్‌ నిర్మాణం

== మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రత్యేక చొరవతో నిధులు మంజూరు

== రేపు నూతన మార్కెట్‌కు మంత్రులు నిరంజన్‌రెడ్డి, అజయ్‌కుమార్‌ శంకుస్థాపన

== భారీ బహిరంగ సభ.. పెద్ద సంఖ్యలో రైతులు, జన సమీకరణ

== బారీగా ఏర్పాట్లు చేస్తున్న మార్కెట్ పాలకసభ్యులు

== రోల్‌మోడల్‌ మార్కెట్‌గా ఖమ్మం మార్కెట్‌ను తీర్చిదిద్దుతాం – మంత్రి పువ్వాడ వెల్లడి

==రైతుల కల సాకారమవుతున్నందుకు సంతోషంగా ఉందన్న చైర్మన్ లక్ష్మి ప్రసన్న

(ఖమ్మంప్రతినిధి-విజయం న్యూస్);-
రైతుల కల సాకారమవుతున్న శుభవేళ ఇది.. ఎన్నోఏళ్లుగా మార్కెట్ సరిపోక, రైతుల తెచ్చిన పంటను రోడ్లపై వేసి నిత్యం అకాలవర్షాలకు అపారంగా నష్టపోతూ కన్నీటి పాలవుతున్న పంటను చూసి గుండెలలిసేలా రోదిస్తున్న సందర్భంలో ఖమ్మం జిల్లా అమాత్యుడు అద్భుతమైన నిర్ణయం తీసుకున్న శుభసందర్భం ఇది.. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చూపిన కృషి ఫలించి మార్కెట్ చరిత్రలో లేని అద్భుత ఘట్టం ఆవిష్కారం కాబోతున్నది. వ్యవసాయ మార్కెట్‌ను అన్ని హంగులతో, అత్యాధునిక సదుపాయాలతో ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు నిర్మాణం కాబోతుంది..ఖమ్మం మార్కెట్ కాస్త రోల్ మోడల్ మార్కెట్ గా నిర్మాణం కానుంది. అందుకు గురువారం ఉదయం సుముహర్తానా అంకురార్పణ పడనుంది.. అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేసే పనిలో మార్కెట్ పాలక వర్గం, అధికారులు నిమగ్నమైయ్యారు.. జనసమీకరణతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి తెలంగాణ సర్కార్ ఏం చేస్తుందో..? ఎవరి పక్షాన ఉన్నదో చైతన్య పరిచేసేందుకు కసరత్తు చేస్తున్నారు..

also read :-
ఎప్పుడూ సరికొత్త అభివృద్ధి అద్భుతదృశ్యాలను ఆవిష్కరించే రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఈసారి అభివృద్ధి బాటలోనే మరో చరిత్రకు నాంది పలకనున్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ను సర్వహంగులతో నూతనంగా నిర్మించటానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. అందుకు రూ.10 కోట్ల 34 లక్షల నిధులను విడుదల చేసింది. దీనికి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చూపిన కృషి ఫలించి మార్కెట్ చరిత్రలో లేని అద్భుత ఘట్టం ఆవిష్కారం కాబోతున్నది. వ్యవసాయ మార్కెట్‌ను అన్ని హంగులతో, అత్యాధునిక సదుపాయాలతో ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు నిర్ణయించారు.

also read :-

మార్కెట్లలో విశాలమైన యార్డుతో పాటు ధాన్యం నిలువ చేసేందుకు గోదాంలు, హర్వేస్టింగ్, ప్రాసెసింగ్, కోల్డ్ స్టోరేజీ గోదాంలు, రైతులకు విశ్రాంతి గదులు, మంచినీటి వసతి, ప్లాట్ ప్లామ్స్, ఆధునిక తూకం యంత్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఖమ్మం ను సుందరంగా తీర్చిదిద్దుతూ శిధిలావస్థలో ఉన్న ప్రజల అస్తులైన కార్పొరేషన్ కార్యాలయం, మార్కెట్ ను నూతనంగా నిర్మించాలనే సంకల్పంతో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అందుకు తగు చర్యలు చేపట్టారు. కార్పొరేషన్ కార్యాలయం పూర్తై ప్రారంభమైంది ఇక నూతన మార్కెట్ నిర్మాణానికి నేడు మంత్రులు నిరంజన్‌రెడ్డి, అజయ్‌కుమార్‌ శంకుస్థాపన చేయనున్నారు. ఖమ్మం నగరం దినదినాభివృద్ధి చెందుతున్న తరుణంలో ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించాలని మంత్రి సంకల్పించారు.
== ఇద్దరు మంత్రుల చేతుల మీదగా శంకుస్థాపన
ఖమ్మం రోల్ మోడల్ మార్కెట్ యార్డు నిర్మాణానికి గురువారం ఉదయం 10.45 గంటలకు శంకుస్థాపన కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ముఖ్యఅతిథిలుగా హాజరుకానున్నారు. వారి చేతులమీదగా రోల్ మోడల్ మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన జరగనుంది. అందుకు గాను వారిద్దరు ప్రత్యేక హెలికాప్టర్ లో హైదరాబాద్ నుంచి ఖమ్మం రానున్నారు.
== ఏర్పాట్లు చేస్తున్న పాలకసభ్యులు, అధికారులు
ఖమ్మం రోల్ మోడల్ మార్కెట్ యార్డు శంకుస్థాపన సందర్భంగా ఇద్దరు మంత్రులు హాజరువుతున్నఈ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకునేందుకు మార్కెట్ పాలకమండలి భారీగా ఏర్పాట్లు చేస్తోంది. ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ డౌలే లక్ష్మిప్రసన్న, వైస్ చైర్మన్ కొంటిముక్కుల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సంబంధిత అధికారులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి బారీ బహిరంగ సభను నిర్వహించాలని నేతలు ఆలోచిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ రైతులకు ఏవిధంగా ప్రభుత్వ పథకాలను అమలు చేస్తుందో ఈ మీటింగ్ ద్వారా తెలియజేసేందుకు యాక్షన్ ప్లాన్ చేస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ రైతుల పక్షంగానే పాలన కొనసాగిస్తున్నారని మరోసారి నిరూపించేందుకు ఈ సభను ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.
★ రోల్‌మోడల్‌ మార్కెట్‌గా ఖమ్మం మార్కెట్‌ను తీర్చిదిద్దుతాం – మంత్రి పువ్వాడ వెల్లడి
ఖమ్మం ప్రజల దశాబ్దాల కల నెరవేరబోతున్నదని జిల్లా రైతుల ఆకాంక్షకు అనుగుణంగా నూతన మార్కెట్‌ను నిర్మిస్తామని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. రోల్‌మోడల్‌ మార్కెట్‌గా ఖమ్మం మార్కెట్‌ను తీర్చిదిద్దుతామన్నారు. గతంతో పోల్చుకుంటే జిల్లాలో సాగు విస్తీర్ణం, పంట దిగుబడి గణనీయంగా పెరిగిందని అందుకు అనుగుణంగా వ్యవసాయ మార్కెట్‌ నిర్మాణం ఉంటుందన్నారు. నూతన వ్యవసాయ మార్కెట్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇతర జిల్లాల రైతులకూ ప్రయోజనం చేకూరనున్నదని మార్కెట్‌కు అప్రోచ్‌రోడ్‌, మౌలిక వసతులు కల్పిస్తామని మంత్రి పువ్వాడ అజయ్ పేర్కొన్నారు వ్యాపారులు, కార్మికులు, రైతులకు విశ్రాంతి భవనాలు అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వెల్లడించారు.
== రైతుల కల నేరవేరుతునందుకు సంతోషంగా ఉంది : డౌలే లక్ష్మిప్రసన్న

‘ఖమ్మం మీద ప్రేమ ఉన్నోళ్లే.. ఖమ్మం ప్రజల గురించి ఆలోచిస్తరు. ఖమ్మం ప్రజల బాగుకోసం కష్టపడుతరు’ మంత్రి అజయ్‌కుమార్‌ చెప్పే మాట అక్షరాలా నిజం చేస్తున్నారు మంత్రి. ఇందుకు తార్కాణమే మార్కెట్ నిర్మాణం. ఖమ్మం రైతుల కల సాకారం కాబోతుంది. దశాబ్దాలుగా వ్యవసాయ మార్కెట్‌ కోసం ఎదురుచూసిన వ్యాపారులు, కార్మికులకు ప్రయోజనం చేకూరబోతున్నది. పొరుగు జిల్లాలకు సైతం ఈ మార్కెట్‌ ఆసరాగా నిలవనున్నది. అందుకే రైతుల కల సాకారమవుతున్న సందర్భంగా నాకు చాలా సంతోషంగా ఉంది. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు ధన్యవాదాలు. ఆయనకు మేము ఏమిచ్చి రుణం తీర్చుకోగలము.