అగ్నిపథ్ ను తక్షణమే ఉపసంహరించుకోవాలి : మంత్రి పువ్వాడ
★ దేశంలో బీజేపీ ప్రభుత్వం అగ్గి రాజేస్తుంది
★ రాకేష్ కుటుంబానికి ప్రగాడ సానుభూతి చెబుతున్నాం
ఖమ్మంప్రతినిధి, జూన్ 18(విజయంన్యూస్)
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ఖమ్మం నగరంలో జరిగిన నూతన రాజ్యసభ సభ్యులకు అభినందన, సీఎం కేసిఆర్ కు కృతజ్ఞత సభలో పాల్గొని మంత్రి మాట్లాడారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మొన్న నల్ల చట్టాలతో రైతుల ఉసురుపోసుకుందని, నేడు యువత జీవితాలతో ఆడుకుంటున్నదని, దేశంలో బీజేపీ సర్కారు అగ్గి రాజేస్తుందని మంత్రి ధ్వజమెత్తారు. త్రివిధ దళాల్లో సైనిక బలగాల నియామకం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అగ్నిపథ్ రిక్రూట్ మెంట్ స్కీంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
allso read- ఖమ్మంలో ఎంపీలకు అడుగడుగున నిరాజనం
ఖమ్మం జిల్లాకు చెందిన ఇద్దరు వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథి రెడ్డిలను సీఎం కేసిఆర్ రాజ్యసభ సభ్యులుగా నియమించడం గర్వకారణమని పేర్కొన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పదికి పది స్థానాల్లో తెరాసను గెలిపించి సీఎం కేసిఆర్ కు కృతజ్ఞతగా ఇచ్చేందుకు తమ వంతు కృషి ఇరువురిని చేయాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కోరారు.