Telugu News

రామాలయ నిర్మాణం కోసం మంత్రి పువ్వాడ రూ.50వేలు వితరణ

హర్షం వ్యక్తం చేసిన గ్రామస్తులు.

0

 

*రామాలయ నిర్మాణం కోసం మంత్రి పువ్వాడ రూ.50వేలు వితరణ.*

*తన పీఏ రవి కిరణ్ చేతుల మీదుగా అందజేత.*

*హర్షం వ్యక్తం చేసిన గ్రామస్తులు.

ఖమ్మం, జూన్ 20(విజయంన్యూస్)

రఘునాథపాలెం మండలం కుర్రా తండా గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న రామాలయం నిర్మాణ పనులకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  చేయూతనిచ్చారు.

నిర్మాణం ఖర్చుల నిమిత్తం రూ.50వేలను తన పీఏ రవికిరణ్ ద్వారా ఆలయ కమిటి సభ్యులకు సోమవారం వీడీవోస్ కాలనీ లోని క్యాంపు కార్యాలయంలో అందజేశారు.

గ్రామ ప్రజలు ఎంతో భక్తశ్రద్ధలతో గ్రామంలో నిర్మిస్తున్న రామాలయ నిర్మాణం ఊరికే ఆశీర్వాదం అని అన్నారు.

Allso read:- ఆర్టీసీ కార్గో సూపర్ సక్సెస్ :మంత్రి పువ్వాడ

ఆలయ నిర్మాణ పనులు వేగం చేసి త్వరగా నిర్మాణ పనులు పూర్తి చేయలని కోరారు.

రామాలయం నిర్మాణ కోసం నగదు వితరణ చేసిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారికి గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

కమిటి సభ్యులు కొర్రా చిన్న వీరన్న, కోర్రా జుమ్మ, రందాస్, సుభాష్ చంద్రబోస్, భద్రాజి, దరావత్ రంచంద్రు, రుప్లా తదితరులు ఉన్నారు.

Allso read:- షర్మిల..దమ్ముంటే నాపై పోటీ చేసి గెలువు