Telugu News

జిల్లాలోనే మకాం వేసిన  మంత్రి పువ్వాడ 

ఎప్పటికప్పుడు వర్షాలు, వరదలపై పర్యవేక్షిస్తున్న మంత్రి అజయ్

0

జిల్లాలోనే మకాం వేసిన  మంత్రి పువ్వాడ 

== ఎప్పటికప్పుడు వర్షాలు, వరదలపై పర్యవేక్షిస్తున్న మంత్రి అజయ్

== సీఎం కేసిఆర్ సూచనలతో గత మూడు రోజులుగా జిల్లాలో మంత్రి అజయ్ మకాం

ఖమ్మం ప్రతినిధి, జులై 13(విజయంన్యూస్)

గత వారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరదల దృష్ట్యా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని క్షేత్ర స్థాయి పరిస్థితులను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్వయంగా జిల్లాలోనే ఉండి పర్యవేక్షిస్తున్నారు. సీఎం కేసిఆర్ సూచనల మేరకు గత మూడు రోజులుగా జిల్లాలోనే మంత్రి మకాం వేశారు. ఎప్పటికప్పుడు అధికారులను, లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఎటువంటి పరిస్థితులు ఉత్పన్నమైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వ అధికార యంత్రాంగం సంసిద్దంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అధికారులకు సహకరిస్తూ, స్వీయ నియంత్రణ పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి : వరద బాధితులకు భరోసానిస్తూ.. భద్రత కల్పించిన మంత్రి అజయ్