Telugu News

ప్రతి ధాన్యం గింజను కొంటాం :మంత్రి పువ్వాడ అజయ్ 

ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు భయపడోద్దు

0

ప్రతి ధాన్యం గింజను కొంటాం :మంత్రి పువ్వాడ అజయ్
** ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు భయపడోద్దు
** జిల్లాలో 247 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాం
** 77,808మెట్రిక్ టన్నుల ధాన్యం కోనుగోలు చేశాం
** 9721 మంది రైతులకు సంబంధించిన రూ.167 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేశాం
** 4,396 మంది రైతులకు రూ.75 కోట్లను ఇప్పటికే చెల్లించాం
** ట్యాబ్ ఏంట్రీ అయిన 24గంటల్లోపే రైతుల ఖాతాలో డబ్బులు చెల్లింపు
రైతులకు భరోసా కల్పించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
(ఖమ్మం ప్రతినిధి- విజయంన్యూస్)
వానాకాల సీజన్ వరి ధాన్యం పంట ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు ఎవ్వరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. బుధవారం టి.టి.డి.సి సమావేశ మందిరంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు, రవాణా, ధాన్యం నిల్వలు, గన్నీ బ్యాగుల నిల్వలు, రైతుల ఖాతాల్లో నగదు జమ తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ తో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటికే 247 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఇప్పటి వరకు 77 వేల 808 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని, ట్యాబ్ ఎంట్రీ అయిన 24 గంటల్లోపు రైతుల ఖాతాలకు చెల్లింపులు చేయడం జరుగుతుందన్నారు. నేటి వరకు 9721 మంది రైతుల నుండి 167 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని, 75
కోట్ల రూపాయలను 4,396 మంది రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించే ముందు తూర్పారబట్టి, తేమశాతం చూసుకొని రైతులు తీసుకరావాలని సూచించారు. మ్యాచర్ వచ్చిందంటే తక్షణమే కొనుగోలు చేస్తున్నామని తెలిపారు.

ALLSO READ :- బొల్తా పడిన బస్సు.. 8మంది మృతి

మ్యాచర్ రాకపోవడం వల్లనే కొన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్నట్లు అధికారులు చెబుతున్నారని తెలిపారు. ఎట్టి పరిస్థితిల్లో రైతులను నష్టపెట్టబోమని స్పష్టం చేశారు. రైతులను అదుకునే, అండగా ఉండే ప్రభుత్వమే సీఎం కేసీఆర్ ప్రభుత్వమని అన్నారు. రైతులు ఇబ్బందులు పడితే మా కంట కన్నీరు వస్తుందన్నారు. రైతుల మేలు కోరే కేంద్రం చేసిన మోసానికి రైతులు బలి కావోద్దనే ఉద్దేశ్యంతోనే ముందుగానే యాసంగిలో వరి పంటలను రైతులు సాగు చేయోద్దని చెబుతున్నామని తెలిపారు.
** ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలి
కొనుగోలు కేంద్రానికి తీసుకొని వచ్చిన ధాన్యాన్ని కాంట వేసి మిల్లులకు తరలించేందుకు సత్వర చర్యలు చేపట్టాలని రాష్ర్ట రవాణాశాఖమంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అధికారులకు సూచించారు. రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యానికి సత్వరమే రైతుల ఖాతాలకు నగదు జమ చేయడం జరుగుతుందన్నారు. జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మాట్లాడుతూ వానాకాలం సీజన్ ధాన్యాన్ని కొనుగోలుకు అన్ని ముందస్తు ఏర్పట్లతో సంసిద్ధం చేసామని కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యాన్ని తేమశాతం ఆధారంగా కాంటా వేసి డెటా ఆప్ లోడ్ చేయడం ద్వారా చెల్లింపులు వెనువెంటనే చేయడం జరుగుతుందన్నారు.

ALLSO READ :- *కల్యాణ లక్ష్మీ/షాది ముభారక్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ..*

ధాన్యానికి సరిపోను గన్నీ బ్యాగులు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. వచ్చే యాసంగిలో వరికి ప్రత్యామ్నాయ పంటలను మాత్రమే సాగు చేసుకునే విధంగా రైతులను విస్తరణాధికారులు సమన్వయంతో అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు, సత్తుపల్లి, వైరా శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య, లావుడ్యా రాములు నాయక్, డి.సి.సి.బి చైర్మన్ కూరాకుల నాగభూషణం, రైతు సమన్వయ సమితి జిల్లా కో-ఆర్డినేటర్ నల్లమల వెంకటేశ్వరరావు, డి.సి.ఎం.ఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు, అదనపు కలెక్టర్ ఎన్.మధుసూదన్, జిల్లా పౌర సరఫరాల శాఖాధికారి రాజేందర్, సివిల్ సప్లయిస్ జిల్లా మేనేజర్ సోములు, జిల్లా వ్యవసాయశాఖాధికారి విజయనిర్మల, జిల్లా సహాకార శాఖాధికారి విజయకుమారి, జిల్లా రవాణా శాఖాధికారి కిషన్, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియోషన్ అధ్యక్షులు బొమ్మరాజేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.