Telugu News

కోలాటమేసిన మంత్రి పువ్వాడ

శివాయిగూడెంలో పలు అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేసిన మంత్రి

0

కోలాటమాడిన మంత్రి పువ్వాడ

పల్లెలు పట్టణాలకు ధీటుగా అభివృద్ధి చెందాయి :మంత్రి

== శివాయిగూడెంలో పలు అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేసిన మంత్రి

ఖమ్మం, జూన్ 18(విజయంన్యూస్)

పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా రఘునాథపాలెం మండలం శివాయిగుడెం, మంచుకొండ గ్రామాల్లో రూ.1.87 లక్షలతో నిర్మించిన అభివృద్ధి పనులను శుక్రవారం సాయంత్రం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. శివాయిగూడెం గ్రామంలో రూ.15 లక్షలతో నిర్మించిన సైడు కాల్వలు, సీసీ రోడ్లను మంచుకొండలో రూ.1.72 లక్షలతో నిర్మించిన సి.సి రోడ్లు, సెంట్రల్ లైటింగ్ పనులను జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఆనంతరం మోడల్ విలేజ్ స్కీంలో భాగంగా హడ్కో నిధులు రూ. 70లక్షలతో రోడ్డు వెడల్పు, సీసీ రోడ్స్, డ్రెయిన్లు, కల్వర్ట్స్, సెంట్రల్ డివైడర్స్, సెంట్రల్ లైటింగ్ అభివృద్ధి పనులు వారు ప్రారంభించారు.

allso read- షర్మిల..దమ్ముంటే నాపై పోటీ చేసి గెలువు

– ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పల్లె ప్రగతిలో గత నాలుగు విడతల్లో చేపట్టిన అభివృద్ధి పనులతో పాటు ఈ విడతతో గ్రామాల్లో సమగ్రాభివృద్ధి సాధించగలిగామన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల్లో పట్టణ వాతావరణం సంతరించుకుందన్నారు. ఈ సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ లక్ష్మీ ప్రసన్న, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి విద్య చందన,జిల్లా పంచాయతీ అధికారి హరిప్రసాద్, మండల ప్రత్యేక అధికారి విజయ కుమారి, పంచాయతీ రాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కె.శ్రీనివాస్, జడ్.పి.టి.సి. ప్రియాంక, ఎం.పి.పి. గౌరి, తాసిల్దార్ నరసింహ రావు, మండల అభివృద్ధి అధికారి రామకృష్ణ, శివాయిగూడెం, మంచుకొండ సర్పంచ్ లు ప్రదీప్, విజయ స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.