కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ..
లబ్దిదారులకు చెక్కుతో పాటు చీర, భోజనం ఏర్పాట్లు చేసిన మంత్రి..
కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ..
== 97 చెక్కులకు గాను రూ.97.09 లక్షల పంపిణీ..
== లబ్దిదారులకు చెక్కుతో పాటు చీర, భోజనం ఏర్పాట్లు చేసిన మంత్రి..
ఖమ్మంప్రతినిధి, జులై 22(విజయంన్యూస్)
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మి, షాది ముభారక్ పథకం ద్వారా మంజూరైన 97మందికి చెక్కులకు గాను రూ.97.09లక్షల విలువైన చెక్కులను మంత్రి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మం వీడీవోస్ కాలనీలోని క్యాంపు కార్యాలయంలో స్వయంగా పంపిణీ చేశారు.చెక్కుతో పాటు చీర, లబ్దిదారులకు ఆత్మీయ విందు భోజనం ఏర్పాటు చేశారు. లబ్ధిదారులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ పథకం పేద ప్రజలకు ఎంతో ఆసరాగా నిలుస్తుందన్నారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని పేర్కొన్నారు.
ALLSO READ- రైతులకు కేంద్రం మీటర్.. రాష్ట్రం వాటర్ :మంత్రి పువ్వాడ
రాష్ట్ర వ్యాప్తంగా కళ్యాణ లక్ష్మీ పథకం ద్వారా నేటి వరకు 12 లక్షల మందికి కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రభుత్వం ఇచ్చిందన్నారు. ఖమ్మం నియోజకవర్గం పరిధిలోనే నేటి వరకు రూ.66.50 కోట్ల విలువైన చెక్కలు ఇవ్వడం గర్వంగా ఉందన్నారు. అందుకు ముఖ్యమంత్రి కేసీఅర్ కి కృతజ్ఞతలు తెలిపారు. అభివృధ్ధి, సంక్షేమం విషయంలో ముఖ్యమంత్రి కేసీఅర్ ది పెద్ద మనసు అని, అనేక పథకాలు రూపకల్పన చేసి రాష్ట్రాన్ని ప్రగతి వైపు పరుగులు పెట్టిస్తున్నారని అన్నారు. పేద ఇంటికి అన్ని తానై నిలిచారని, ఆడపిల్ల గర్భం దాల్చిన నాటి నుండి మళ్ళీ ఆ బిడ్డ ఉన్నత విద్య ను అభ్యసించి ఉద్యోగం పొందే వరకు ప్రభుత్వం అన్ని దశలలో సంక్షేమాన్ని అందిస్తూనే ఉందన్నారు. ఆడపిల్ల పెళ్ళి అనంతరం కళ్యాణ లక్ష్మి ద్వారా రూ.లక్ష, గర్భం దాల్చితే అంగన్వాడీ ద్వారా పోషక ఆహారం, ప్రభుత్వ ఆసుపత్రిలో నాణ్యమైన ఉచిత వైద్యం, కాన్పు అనంతరం కేసీఅర్ కిట్, ఆడ బిడ్డ పుడితే రూ. 13 వేలు, మగ బిడ్డ పుడితే రూ.12 వేలు, ఆయా బిడ్డలు చదువుకోవడానికి ఉన్నత విద్యను అభ్యసించి ఉద్యోగంలో స్థిరపడే వరకు ప్రభుత్వం కంటికి రెప్పలా కాపాడుతు వారికి అన్ని తానై నిలిచింది ఒక్క తెలంగాణ ప్రభుత్వం మాత్రమే అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ సహాయంతో ఎంతో మంది పేద కుటుంబాలకు పెండ్లిల భారం తగ్గిందని తెలిపారు. ఆడపిల్లల తల్లిదండ్రులు ఆర్థికంగా ఇబ్బంది పడవద్దు అనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు. సీఎం కేసీఆర్ కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తున్నారని, ఎన్ని అడ్డంకులు వచ్చినా అలానే కొనసాగిస్తున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ, తహసీల్దార్ శైలజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా, అన్ని డివిజన్ల కార్పొరేటర్ లు, నాయకులు తదితరులు ఉన్నారు.
ALLSO READ- లంచం అడిగితే ఊరుకునేదే లేదు: కందాళ