Telugu News

జాతీయ గీతాలాపణ చేసిన మంత్రి పువ్వాడ

న క్యాంఫ్ కార్యాలయంలో సిబ్బందితో కలిసి గీతాలాపన

0

జాతీయ గీతాలాపణ చేసిన మంత్రి పువ్వాడ

== తన క్యాంఫ్ కార్యాలయంలో సిబ్బందితో కలిసి గీతాలాపన

ఖమ్మంప్రతినిధి, ఆగస్టు 16(విజయంన్యూస్)

స్వతంత్ర భారత వజ్రోత్సవాలను సందర్భంగా మంగళవారం సామూహిక జాతీయగీతాలాపన కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హైదరాబాద్ లోని ఆయన అధికారిక నివాసంలో పాల్గొన్నారు. దేశం కోసం త్యాగం చేసిన వీరుల విజయగాథలనే సామూహికంగా గొంతెత్తి పాడుకున్నామని జన సమూహాల ఐకమత్యమే మన జాతికి బలమని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. సీఎం కేసిఆర్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున స్వతంత్ర భారత వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నదని అన్నారు. సామూహిక జాతీయ గీతాలాపనను చేయడం మనమంతా కలసిమెలసి వర్ధిల్లే లౌకికతత్వ భారత్‌ను చెక్కు చెదరనీయకుండా చూడటం కోసం ప్రతిన చేయటమే అవుతుందన్నారు. ప్రతి ఒక్కరూ కడు నిబద్ధతతో క్రమశిక్షణతో దేశభక్తిని గుండెల నిండా నింపుకొని ఈ మట్టి సాక్షిగా మేమంతా ఒక్కటే, భారతీయులమంతా సహోదరులమని చాటిచెప్పే కోట్లాది కంఠాల సామూహిక జాతి స్వరంగా ఈ జాతీయ గీతాలాపన చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది అని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చెప్పారు.

ఇది కూడా చదవండి : టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య హత్య..ఎందుకోసమంటే..?