Telugu News

రెండవ రోజు కొనసాగిన మంత్రి పువ్వాడ బుల్లెట్ పయనం

ఇండ్లకు వెళ్ళి లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మిచెక్కులు పంపిణి చేసిన మంత్రి

0

రెండవ రోజు కొనసాగిన మంత్రి పువ్వాడ బుల్లెట్ పయనం

** ఇండ్లకు వెళ్ళి లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మిచెక్కులు పంపిణి చేసిన మంత్రి

(ఖమ్మం ప్రతినిధి-విజయం న్యూస్)

* ఖమ్మం నగరంలోని పలు డివిజన్ లలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బ
బుల్లెట్ పయనం రెండవ రోజు కొనసాగింది. మంగళవారం
రెండవరోజు కల్యాణ లక్ష్మీ, షాది ముభారక్ &సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంత్రి పువ్వాడ స్వయంగా లబ్ధిదారుల ఇండ్లకు వెళ్ళి పంపిణి చేశారు.

ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో మంజూరైన 223-కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులకు గాను రూ.2.23 కోట్లు, మరియు 351౼CMRF చెక్కులకు గాను రూ.1.45కోట్ల రూపాయల విలువైన చెక్కులను మేయర్ పునుకొల్లు నీరజతో కలిసి రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్ని డివిజన్లలో తిరిగి రెండు రోజుల పాటు మోటార్ సైకిల్ పై స్వయంగా చెక్కులు పంపిణీలో భాగంగా రెండవ రోజు కూడా అదే జోరుతో పంపిణీ చేశారు.

allso read :- బుల్లెట్ పై ప్రజల వద్దకు మంత్రి అజయ్.

◆ ఉదయం 3టౌన్ లోని 17, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 36, 35, 47, 48, 46వ డివిజన్లలో పంపిణి చేశారు.

◆ సాయంత్రం ఖానాపురం హవేలీ మరియు అర్బన్ లోని 14, 8, 9, 10, 7, 6, 5, 4, 3, 2, 15వ డివిజన్లలో పంపిణి చేశారు.  ఈ కార్యక్రమంలో ఖమ్మం నగరమేయర్ పూనకొల్లు నీరజ, ఖమ్మం వ్వయసాయమార్కెట్ కమిటీ చైర్మన్ డౌలి లక్ష్మిప్రసన్నసాయికిరణ్, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, నగరకమిటీ అధ్యక్షుడు  పగడాల నాగరాజు, కార్పోరేటర్లు తదితరులు పాల్గొన్నారు.