Telugu News

*కల్యాణ లక్ష్మీ/షాది ముభారక్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ..*

33 చెక్కులకు గాను రూ.33 లక్షల పంపిణీ.

0

*కల్యాణ లక్ష్మీ/షాది ముభారక్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ..*

◆ 33 చెక్కులకు గాను రూ.33 లక్షల పంపిణీ.

◆ నేటి వరకు 5682 చెక్కులకు గాను రూ.50.83 కోట్ల రూపాయల అందజేత.

(ఖమ్మం ప్రతినిధి-విజయం న్యూస్)

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలు చేస్తున్న కల్యాణలక్ష్మీ/షాది ముభారక్ పథకం ద్వారా ఖమ్మం నియోజకవర్గం రఘునాధపాలెం మండలంలో మంజూరైన 33-చెక్కులకు గాని రూ.33లక్షల విలువైన చెక్కులను రఘునాధపాలెం మండల రైతు వేదిక నందు స్వయంగా పంపిణీ చేసిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ..

నేటి వరకు మండలంలో 1348 చెక్కులకు గాను రూ.11.82 కోట్లు, నియోజకవర్గ వ్యాప్తంగా 5682 చెక్కులకు గాను రూ.50.83 కోట్ల రూపాయల విలువైన చెక్కులు అండజేయడం సంతోషంగా ఉందన్నారు.

all so read;:- మంత్రి పువ్వాడ ను కలిసిన ఎమ్మెల్సీ తాతా మధు..

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన ఈ పథకంతో పేదల ఆడపిల్ల పెళ్లి చేయడానికి తల్లిదండ్రులు భయపడకుండా నిశ్చింతగా ఉన్నారన్నారు.

కళ్యాణ లక్ష్మీ/షాది ముభారక్ పథకం దేశంలో ఎక్కడా లేదన్నారు. ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ పథకం అమలు చేస్తున్న ప్రభుత్వం తెలంగాణ ఒక్కటే అన్నారు.