చిన్నారి అభినయశ్రీ వైద్యానికి మంత్రి పువ్వాడ సాయం
== మంత్రి సిఫార్సుతో రూ. 5 లక్షల ఎల్వోసీ మంజూరు
ఖమ్మం ప్రతినిధి, జులై 1(విజయంన్యూస్)
తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ మరోసారి తన ఔదర్యాన్ని చాటుకున్నారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం బొడ తండాకు చెందిన అభినయశ్రీ అనే చిన్నారికి కిడ్నీ సంబంధిత సంబంధిత వ్యాధితో బాధపడుతున్న విషయాన్ని తెలుసుకొని చిన్నారికి మెరుగైన వైద్యం అందించేందుకు తక్షణమే మంత్రి అజయ్ స్పందించారు. హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తీసుకురావాలని చిన్నారి తల్లిదండ్రులకు సూచించారు. వైద్య ఖర్చులకు ప్రభుత్వం నుంచి సీఎం రిలీఫ్‌ఫండ్ ద్వారా రూ.5 లక్షల ఎల్వోసీ మంజూరు చేయించారు. శుక్రవారం హైదరాబాద్‌లో చెక్కును చిన్నారి తండ్రి రమేష్ కు స్వయంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అందజేశారు
allso read- పీఎస్ఎల్వీ విజయం దేశానికే గర్వకారణం: మంత్రి పువ్వాడ