Telugu News

గ్రామాల్లో వంద శాతం సిసి రోడ్లు :మంత్రి పువ్వాడ

ప్రతి గ్రామం పచ్చని తోరణంగా ఉండాలి

0

గ్రామాల్లో వంద శాతం సిసి రోడ్లు

== ప్రతి గ్రామం పచ్చని తోరణంగా ఉండాలి

== పారిశుధ్య సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలి

== రఘునాథపాలెంలో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసిన మంత్రి అజయ్ కుమార్

రఘునాథపాలెం/ఖమ్మం ప్రతినిధి, జూన్ 17(విజయంన్యూస్)

గ్రామాల్లో వంద శాతం సిసి రోడ్ల నిర్మాణాలు చేస్తున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. శుక్రవారం రఘునాధపాలెం మండల కేంద్రంలో రూ. 65 లక్షల వ్యయంతో నిర్మించిన 15 సిసి రోడ్లను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయితి కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమం పల్లెలు పచ్చగా కళ కళ లాడాలని, పరిశుభ్రంగా మెరవాలని చేపట్టినట్లు తెలిపారు. పారిశుద్ధ్య నిర్వహణకు ప్రతి గ్రామంలో ఇంటింటికి తిరిగి చెత్త సేకరణకు ట్రాక్టర్లు, గ్రామం పచ్చగా ఉండడానికి హరితహారం క్రింద నాటిన మొక్కల సంరక్షణకు ట్యాంకర్, చెత్తను కంపోస్టుగా మార్చి, గ్రామ పంచాయితీకి ఆదాయం కొరకు సేగ్రిగేషన్ షెడ్లు, నర్సరీలు, వైకుంటదామాలు ఏర్పాటుచేసుకోని, ప్రతి రోజు సిసి రోడ్ గా మార్చుకొని అద్భుతంగా అభివృద్ధి చేసుకున్నామన్నారు. ఈ ఒక్క సంవత్సరమే మండలంలో సిసి రోడ్లకు రూ. 80 లక్షలకు పైగా ఖర్చు చేసినట్లు, మరో 7-8 రోడ్లు వేసుకుంటే రఘునాధపాలెంలో వంద శాతం సిసి రోడ్లు పూర్తవుతాయని మంత్రి అన్నారు.

allso read- షర్మిల..దమ్ముంటే నాపై పోటీ చేసి గెలువు

అభివృద్ధితో గ్రామాల్లో భూముల రెట్లు పెరిగాయని, గజానికి వేయి రూపాయల నుండి ఇప్పుడు గజానికి 10 వేలకు పైగా పలుకుతుందని ఆయన అన్నారు. గ్రామాల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు, 24 గంటల కరంట్ ఇస్తున్నట్లు, రైతు బంధు, రైతు భీమా, దళితబందు, ఆసరా పెన్షన్లు, కళ్యాణలక్ష్మి, శాది ముబారక్ లాంటి ఎన్నో సంక్షేమ పధకాలు పేదలను అందిస్తున్నట్లు, మిషన్ భగీరథ ద్వారా సురక్షితమైన త్రాగునీరు ఇంటింటికి నల్లా ద్వారా సరఫరా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. స్థలం వుండి, ఇల్లు కట్టుకోలేని పేదవారికి ఇల్లు కట్టుకోవడానికి రూ. 3 లక్షల అందజేత త్వరలో చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. పల్లె ప్రగతి కార్యక్రమం తర్వాత కూడా గ్రామాలన్నీ అద్దంలా ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, డిసిసిబి చైర్మన్ కూరాకుల భూషణయ్య, ఏఎంసి చైర్మన్ లక్ష్మి ప్రసన్న, డిఆర్ధివో విద్యా చందన, డిసివో విజయ కుమారి, జెడ్పిటిసి ప్రియాంక, సర్పంచ్ శారద, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

== సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణి చేసిన మంత్రి పువ్వాడ                             

   allso read-  ఆ ఇద్దరికి చెక్ పెట్టేందుకేనా..?

ముఖ్యమంత్రి సహాయ ని నుండి లబ్ధిదారులకు చెందిన 66 చెక్కులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్థానిక విడివోస్ కాలనీ లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో లబ్దిదారులకు స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఖమ్మం నగరం నుండి వివిధ అనారోగ్య కారణాలతో చికిత్సల అనంతరం తన సిఫారసు మేరకు మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి క్రింద 66 మంది లబ్దిదారులకుగాను రూ. 29.43 లక్షల విలువైన చెక్కులను పంపిణి చేసినట్లు తెలిపారు. నేటి వరకు ఎందరో అనారోగ్యంతో బాధపడి, చికిత్సకు ఆర్థికంగా నష్టపోయిన వారు, తిరిగి ఆర్ధికంగా కోలుకోవాలని అందిస్తున్న ఈ సాయం వారి కుటుంబానికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా నేటి వరకు 2901 మంది లబ్ధిదారులకు గాను రూ. 12 కోట్ల 4 లక్షల 71 వేయి 150 రూపాయల విలువ గల చెక్కులను పంపిణీ చేయడం జరిగినట్లు ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహార, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్ పర్సన్ లక్ష్మి ప్రసన్న, కార్పొరేటర్లు కమర్తపు మురళీ, దొరేపల్లి శ్వేత, ఎం ప్రసాద్, సరస్వతి, విజయ తదితరులు పాల్గొన్నారు.