అభివృద్ధి,ఆరోగ్య తెలంగాణే కేసీఅర్ లక్ష్యం : మంత్రి పువ్వాడ
పుష్పగుచ్ఛం, శాలువాలు కప్పు మంత్రి పువ్వాడను సత్కరించిన కార్పొరేటర్లు.
అభివృద్ధి,ఆరోగ్య తెలంగాణే కేసీఅర్ లక్ష్యం : మంత్రి పువ్వాడ
== చేస్తున్న అభివృధ్ధిని చెప్పుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది.
== జరుగుతున్న అభివృధ్ధి చూసి కొందరికి జీర్ణం కట్లేదు..
== ఖమ్మంకు మెడికల్ కళాశాల మంజూరు పట్ల కార్పొరేటర్ల హర్షం..
== పుష్పగుచ్ఛం, శాలువాలు కప్పు మంత్రి పువ్వాడను సత్కరించిన కార్పొరేటర్లు.
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కృషి మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖమ్మం జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు చేయడం పట్ల ఖమ్మం నగర మేయర్ పూనకొల్లు నీరజ ఆధ్వర్యంలో కార్పోరేటర్లు ముఖ్యమంత్రి కేసీఆర్ కృతజ్ఞతలు తెలుపుతూ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కి పుష్పగుచ్ఛంలు అందజేసి శాలువలతో సత్కరించారు. ఆదివారం కార్పొరేటర్ల అధ్వర్యంలో ఎర్పాటు చేసిన కేక్ ను కట్ చేసి పరస్పర శుభాకాంక్షలు తెలుపుకున్నారు. వైద్య విద్యను ఖమ్మం జిల్లాలో మరింత విస్తరించి ప్రజలకు మెరుగైన వైద్యం చికిత్సలు అందిస్తున్న ప్రభుత్వానికి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంధర్భంగా మంత్రి పువ్వాడ మాట్లడుతూ నేడు వైద్యం అత్యంత ఖరీదు అయిందన్నారు. సామాన్యుడికి ఏదైనా రోగం వస్తే కనీసం వైద్యం చేయించుకునే పరిస్థితుల్లో లేడని, అభివృధ్ధి తెలంగాణతో పాటు ఆరోగ్య తెలంగాణ రావాలని భావించిన ముఖ్యమంత్రి కేసీఅర్ గారు తోలి విడతలో 8 వైద్య కళాశాలలు మంజూరు చేశారని అన్నారు. ఖమ్మం జిల్లాలో ప్రైవేట్ మెడికల్ కళాశాల ఉన్నప్పటికీ మళ్ళీ ప్రభుత్వ మెడికల్ కళాశాల మంజూరు చేయడం పట్ల ముఖ్యమంత్రి కేసీఅర్ కి కృతజ్ఞతలు తెలిపారు. మనం చేసిన అభివృధ్ధి కచ్చితంగా చెప్పుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. మనం చేసే అభివృధ్ధి, సంక్షేమం లాంటి కార్యక్రమాల విశిష్టత, వాటి ప్రాముఖ్యత ప్రజలకు వివరించాలని, అలా చేయకపోతే ఎంత అభివృధ్ధి చేసినా నిరుపయోగం అన్నారు. ఖమ్మం పట్ల నాకు ఉన్న విజన్ బాధ్యతాయుతమైనది. అది చేసి చూపించాలనే ఆకాంక్షతో ముందుకు వెళుతున్ననని, ముఖ్యమంత్రి కేసీఅర్, కెటిఆర్ సహకారంతో పని చేస్తున్నామన్నారు.
ఇది కూడా చదవండి : ’ఆ నలుగురు‘ చుట్టే రాజకీయం.. ఖమ్మం జిల్లాలో పొలిటికల్ హిట్
ఖమ్మంలో రాజకీయ పరిజ్ఞానం లేకుండా కొందరు నాయకులు చిత్తశుద్దితో పనిచేస్తున్నారని ఎద్దేవా చేశారు. వారికి అభివృద్ధిని చూస్తే అరుగుదల సమస్య ఉందన్నారు. ప్రతిపక్షాలు విచ్చలవిడిగా గోబెల్స్ ప్రచారం చేస్తుంటే కనీసం మనం చేసిన పని చెప్పుకోవాల్సిన బాధ్యత మనపై లేదా అని ప్రశ్నించారు. ఖమ్మం జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు చేయడం చరిత్రలో మిగిలిపోతుందన్నారు. పేదవాడికి వైద్యంతో పాటు వైద్య విద్య ను కూడా అభ్యసించే అవకాశం కల్పించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో ప్రభుత్వ మెడికల్ కళాశాల అందుబాటులోకి రానుండటంతో వైద్య విద్యను అభ్యసించి, సమాజానికి మరింత మంది వైద్యులు అందుబాటులో ఉండబోతాఉన్నారని, తద్వారా మరింత మంది ప్రజలకు వివిధ రకాల వైద్య సేవలు సులభతరంగా అందుతాయని వైద్య విద్యార్థినిలు అభిప్రాయం వ్యక్తం చేశారు.జై.. కేసీఅర్.. జై అజయ్.. జై తెలంగాణ అంటూ నినాదాలతో హోరెత్తించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మి ప్రసన్న, మాజీ మార్కెట్ కమిటి చైర్మన్ ఆర్ జేసీ కృష్ణ, టౌన్ పార్టీ అధ్యక్షుడు పగడాల నాగరాజు, మాజీ గ్రంధాలయ సంస్ధ చైర్మన్ ఖమర్, అన్ని డివిజన్ల కార్పొరేటర్లు తదితరులు ఉన్నారు.