Telugu News

ఖమ్మంలో భారీగా క్రాస్ ఓటింగ్.. అంతర్మథనంలో టీఆర్ఎస్.. ఫలించిన భట్టి వ్యూహం

** జోష్ లో కాంగ్రెస్.. ఫలించిన భట్టి వ్యూహం

0

ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీగా క్రాస్ ఓట్లు
** టీఆర్ఎస్ కు ఉన్నది 550, పడింది 438
** కాంగ్రెస్ కు ఉన్నది 96, ఓటింగ్ పడింది 242
** జోష్ లో కాంగ్రెస్.. ఫలించిన భట్టి వ్యూహం
** దిష్టానానికి ఫిర్యాదు చేసే దిశగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతామధు
(ఖమ్మం ప్రతినిధి-విజయం న్యూస్)

ఉమ్మడి ఖమ్మం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక్లలో క్రాస్ ఓటింగ్ పడింది. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినధుల ఓట్లు  కాంగ్రెస్ పార్టీకి క్రాస్ అయినట్లుగా ఫలితాలను భట్టి తెలుస్తో్ంది.. టీఆర్ఎస్ పార్టీకి  450 ఓట్లు ఉండగా, సీపీఐ మద్దతు తెలిపి, సీపీఎం బహిష్కరించినప్పటికి కాంగ్రెస్ పార్టీకి రావాల్సిన దానికంటే 148 ఓట్లు అధికంగా రావడంతో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు కనిపిస్తోంది.. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చాంశనీయంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే
ఉమ్మడి ఖమ్మం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది.. టీఆర్ఎస్ అభ్యర్థి తాతా మధుసూధన్ 238ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అయితే టీఆర్ఎస్ గెలిచిందే కానీ ఆ పార్టీ నుంచి భారీగా ఓట్లు క్రాస్ అయినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం 768 ఓట్లకు గాను మొత్తం 738 ఓట్లు పోలైయ్యాయి. అందులో టీఆర్ఎస్ కు 497, కాంగ్రెస్ పార్టీకి 116, సీపీఐ పార్టీకి 34, సీపీఎం పార్టీకి 26, టీడీపీ పార్టీకి 19, న్యూడెమోక్రసీ పార్టీకి 15, బీజేపీకి 1, స్వతంత్రులు 60 మంది ఉన్నారు. కాగా కాలక్రమేనా రాజకీయ మార్పులో భాగంగా సుమారు 53 మంది టీఆర్ఎస్ పార్టీలో చేరారు. దీంతో టీఆర్ఎస్ బలం 550కి చేరింది. కాంగ్రెస్ కు 96, సీపీఐ 34, సీపీఎం 26, టీడీపీ 19, బీజేపీకి 1, స్వతంత్రులు 42 ఉన్నారు. కాగా మంగళవారం లెక్కింపు చేయగా, టీఆర్ఎస్ విజయం సాధించినప్పటికి భారీగా క్రాస్ ఓటింగ్ నమోదైంది. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి 480, కాంగ్రెస్ అభ్యర్థికి 242, కొండపల్లి శ్రీనివాస్ కు 4, చెల్లుబాటు కాని 12 ఓట్లు పడ్డాయి. దీంతో కచ్చితంగా భారీగా క్రాస్ ఓటింగ్ నమోదైనట్లు స్పష్టంగా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మొత్తం 96 ఓట్లు ఉండగా 242 ఓట్లు రావడంతో అందరు అవాక్కైయ్యారు. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు కలవరపడ్డారు. 146 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి అధికంగా రావడంతో రాష్ర్ట వ్యాప్తంగా చర్చాంచనీయమైంది. ఇప్పటికే కమ్యూనిస్టూ పార్టీలు టీఆర్ఎస్ కు అంతర్గతంగాను, బహిరంగంగానో మద్దతు తెలిపారు. 550 ఓట్లతో పాటు సీపీఐ పార్టీకి 36, సీపీఎం పార్టీకి 24, 20మంది స్వతంత్ర అభ్యర్థులు సంపూర్ణంగా టీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలిపారు. దీంతో 630 ఓట్ల బలంతో టీఆర్ఎస్ ఎన్నికలకు వెళ్లింది. కానీ ఫలితాల్లో మాత్రం చాలా తేడా కనిపించింది.

ఇది కూడా చదవండి : -ఖమ్మం ఎమ్మెల్సీ టీఆర్ఎస్ విజయం

కాంగ్రెస్ పార్టీకి 146 ఓట్లు అధికంగా రావడంతో కాంగ్రెస్ పార్టీ యమ జోష్ లో ఉంది. చాలా తక్కువ ఓట్లు ఉన్నప్పటికి గెలుపే లక్ష్యంగా బరిలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థికి భారీగా ఓటింగ్ పెరగడంతో ఆ పార్టీలో ఓటమి బాధ కంటే మెజారిటీ ఓటింగ్ వచ్చిందనే సంతోషంలో కాంగ్రెస్ నేతలు మునిగిపోయారు.
** ఫలించిన భట్టి వ్యూహం.. రాయల మంచితనం
ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి అధికార పార్టీ నుంచి భారీగా క్రాస్ ఓటింగ్ నడిచింది. 96 ఓట్లు ఉన్న కాంగ్రెస్ పార్టీకి 242 ఓట్లు రాబట్టడంతో అందరు అశ్ఛర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి ఏకచత్రాధిపత్యంగా ముందుకు సాగుతున్నసీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన వ్యూహం ఫలించింది. పోటీ చేయరు అనే మాట నుంచి పోటీ చేయాల్సిందే అంటూ అభ్యర్థి ఎంపిక, క్యాంఫ్ కు తరలింపు, ఓటర్లతో మాట్లాడుకునే విషయంతో పాటు అద్భుతమైన వ్యూహంతో భట్టి విక్రమార్క ఎన్నికలను ముందుకు తీసుకెళ్ళారు. చేతికి మట్టి అంటకుండా టీఆర్ఎస్ ఓటర్లకు డబ్బులు పంచే విషయంలో సూపర్ సక్సెస్ అయ్యారు. అధికార పార్టీ, అంతా స్టిక్ట్ గా అభ్యర్థులను గోవా తరలించినప్పటికి ఆ ఓటర్లతో ఓటు వేయించుకున్నారంటే భట్టి వ్యూహం ఎంత వరకు సక్సెస్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు. ఓటర్లను అందరికంటే ముందుగానే కాంగ్రెస్ అభ్యర్థులతో ఓటేయించే విషయంలో కూడా భట్టి వ్యూహం ఫలించింది. అలాగే కాంగ్రెస్ అభ్యర్థి రాయల నాగేశ్వరరావు సౌమ్యుడు కావడం,అందరితో సన్నిహితంగా మెలగడం, అందరితో మంచిగా ఉంటారనే సానుకూల ప్రచారం రావడం కూడా ఇంత భారీ ఓటింగ్ నమోదు అయినట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఇది కూడా చదవండి :- MLC ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన TRS
** గోవా తరలించినప్పటికి
టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది.. ఏ ఒక్క ఓటర్ తో కూడా ప్రతిపక్ష పార్టీ అభ్యర్థికి మాట్లాడే అవకాశం లేకపోయింది.. అధికార పార్టీ ఓటర్లందర్ని గోవాలోని క్యాంఫ్ కు తరలించారు. కనీసం అందుబాటులో కూడా లేరు. అయినప్పటికి టీఆర్ఎస్ పార్టీ నుంచి క్రాస్ ఓటింగ్ జరిగింది. ఇది ఎలా సాధ్యమైందంటే కచ్చితంగా టీఆర్ఎస్ పార్టీలో వర్గపోరు.. ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకతతోనే క్రాస్ ఓటింగ్ పడిందని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని టీఆర్ఎస్ పార్టీలో వర్గపోరు ప్రభావం ఎక్కువగా ఉంది. అందులో సీనియర్లను కాదని తాతా మధుసూధన్ కు టిక్కెట్ ఇవ్వడంతో సీనియర్ నాయకుల వర్గీయులు ఆగ్రహంతో ఉన్నారు. ఈ క్రమంలో వారే ఈ క్రాస్ ఓటింగ్ కు పాల్పడినట్లు ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.
** అదిష్టానానికి ఫిర్యాదు చేసే యోచనలో టీఆర్ఎస్ అభ్యర్థి
ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీగా క్రాస్ ఓటింగ్ నమోదు కావడంతో టీఆర్ఎస్ పార్టీ నేతలు, ఎమ్మెల్సీగా విజయం సాధించిన తాతామధుసూధన్ చాలా ఆగ్రహంగా ఉన్నారు. 630 ఓట్లు రావాల్సి ఉండగా, 438 ఓట్లు రావడంతో ఆయన తీవ్రంగా స్పందించినట్లు సమాచారం. క్రాస్ ఓటింగ్ పై కచ్చితంగా రాష్ట్ర సీఎం కేసీఆర్ కు, పార్టీ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ కు ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎదేమైనప్పటికి ఖమ్మం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇంత పెద్ద మొత్తంలో క్రాస్ ఓటింగ్ పడటం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా చర్చాంశనీయమైంది.