Telugu News

ఓటర్ల తీర్పు ఎటు.. షూరు అయిన పోలింగ్

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రారంభమైన పోలింగ్

0

ఓటర్ల తీర్పు ఎటు.. షూరు అయిన పోలింగ్

** ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రారంభమైన పోలింగ్

** పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు

** ఓటర్లను మినహా ఎవర్ని లోపలికి పంపించని అధికారులు

(ఖమ్మం ప్రతినిధి-విజయంన్యూస్)

ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రక్రీయ షూరు అయ్యింది. శుక్రవారం ఉదయం 8గంటలకే పోలింగ్ ప్రారంభం కాగా 9.30గంటల వరకు ఒక్క ఓటరు కూడా పోలింగ్ కేంద్రం వద్దకు రాలేదు. ఆ తరువాత ప్రజాప్రతినిధులు పోలింగ్ కేంద్రానికి చేరుకుంటున్నారు.  ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం 768 ఓట్లు ఉండగా, అందులో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నాలుగు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఖమ్మం, కల్లూరు, కొత్తగూడెం, భద్రాచలంలో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, ఆయా ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎమ్మెల్సీ స్థానానికి టీఆర్ఎస్ పార్టీ నుంచి తాతా మధుసూధన్, కాంగ్రెస్ పార్టీ నుంచి రాయల నాగేశ్వరరావు, స్వతంత్ర అభ్యర్థులు కొండపల్లి శ్రీనివాస్, కొండ్రు సుధారాణి బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే ఆయా పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు క్యాంఫ్ ల నుంచి ఖమ్మం జిల్లాకు చేరుకున్నారు. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు హైదరాబాద్ నుంచి బయలుదేరగా, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు గురువారం రాత్రి ఖమ్మం చేరుకున్నారు. కాగా స్థానిక సంస్థల పోలింగ్ కు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్, పోలీస్ కమీషనర్ విష్ణు.ఎస్ వారియర్ ఆధ్వర్యంలో బారీ ఏర్పాట్లు చేశారు. వందలాధి మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఎలాంటి అవాంచనీయ సంఘటన చోటు చేసుకోకుండా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. సుమారు 100 మీటర్ల దూరం పాటు ఎవర్ని లోపలికి రానీవ్వడం లేదు. మస్తుగా పోలీసులు బందోబస్తు చేస్తున్నారు. ఎక్కడిక్కడ బారీ కేట్స్ ను ఏర్పాటు చేసి ఓటర్లను మినహా ఏ ఒక్కర్ని లోపలికి పంపించడం లేదు. ఇదిలా ఉంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏం జరుగుతుందోననే ఆసక్తితో ప్రజలు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకతతో ప్రజాప్రతినిధులు క్రాస్ ఓటింగ్ కు పాల్పడే అవకాశం ఉందనే చర్చ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతుంది. తప్పకుండా క్రాస్ ఓటింగ్ జరుగుతుందని, దీని ద్వారా సంచలన ఫలితాలు రావోచ్చని పలువురు భావిస్తున్నన్నారు. మొత్తానికి ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాన్ని ప్రజాప్రతినిధులు ఇవ్వబోతున్నారో.. మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే.. ?

ALLSO READ :- అభ్యర్థుల్లో క్రాస్ ఓటింగ్ భయం..?