ఖమ్మం ఎమ్మెల్సీ టీఆర్ఎస్ విజయం
238 ఓట్ల మెజారిటీతో గెలిచిన తాతామధు
(ఖమ్మం ప్రతినిధి –విజయం న్యూస్)
ఖమ్మం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది.. టీఆర్ఎస్ అభ్యర్థి తాతామధుసూధన్ సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి రాయల నాగేశ్వరరావుపై 238 ఓట్ల మెజారిటీతో మొదటి ప్రాథన్యత ఓట్లతో విజయం సాధించారు. దీంతో టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, నాయకులు సంబరాల్లో ముగినిపోయారు. ఖమ్మం టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంతో పాటు నగరంలో, మండల కేంద్రాల్లో సంబరాలు చేసుకుంటున్నారు. ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ పడుతుంది.. నువ్వానేనా అన్నట్లుగా జరుగుతుందని అంచనాలన్ని పటాపంచలైయ్యాయి.. టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు కచ్చితంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. చాలా స్పష్టమైన మెజారిటీ రావడంతో తాతామధుకు పార్టీ శ్రేణులు అభినందనలు తెలుపుతున్నారు..
తాతా మధు TRS – 480,
రాయల నాగేశ్వరరావు -Cong- 242,
కొండపల్లి శ్రీనివాస్ కు – 4
సుధారాణి -0
ఇన్ వాలీడ్ -12
lead TRS -238
ఇది కూడా చూడండి :- నర్సింహులగూడెం రోడ్డులో డెంజర్ బెల్స్.