కోదాడ క్రాస్ రోడ్డులో ప్రమాదం
లారీలో ఇరుక్కున్న డ్రైవర్..బయటకూ తీసేందుకు రెండు గంటలు ప్రయత్నిస్తున్న యువకులు.
కోదాడ క్రాస్ రోడ్డులో ప్రమాదం
** లారీని ఢికొట్టిన మరో లారీ
** లారీలో ఇరుక్కున్న డ్రైవర్..
** బయటకూ తీసేందుకు రెండు గంటలు ప్రయత్నిస్తున్న యువకులు.
(ఖమ్మంరూరల్ /కూసుమంచి-విజయంన్యూస్)
ఖమ్మం రూరల్ మండలం కోదాడ క్రాస్ రోడ్డు పెట్రోల్ బంక్ సమీపంలోని దాబా వద్ద ఆదివారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో హైదరాబాద్ నుంచి ఖమ్మం వైపు వస్తున్న రెండు లారీలు ఢీకొనడంతో డ్రైవర్ ముందు భాగమంతా లారీ పూర్తిగా ధ్వంసమైంది. లారీలో డ్రైవర్ ఇరుక్కుపోవడం తో అతను కాపాడేందుకు, బయటకు తీసేందుకు స్థానికులు, యువకులు ముమ్మర ప్రయత్నాలు చేసి..సురక్షితంగా బయటకూ తీశారు.. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు కనిపిస్తుంది… డ్రైవర్ .. నల్గొండ జిల్లా, చిట్యాలకు చెందిన జడల రవిగా గుర్తించారు.
allso read-ఈదురుగాలుల దాటికి కూలిన షర్మిల బస ప్రాంగణం టెంట్లు.