జిల్లా అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తా.: నామా నాగేశ్వరరావు
టీ.ఆర్.ఎస్ లోక్ సభాపక్ష నేత, ఎంపీ నామ నాగేశ్వరరావు విస్తృత పర్యటన
జిల్లా అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తా.
== సీఆర్ఐఎఫ్ కింద్ర ఖమ్మం జిల్లాలో రూ.35 కోట్ల మంజూరు
== టీ.ఆర్.ఎస్ లోక్ సభాపక్ష నేత, ఎంపీ నామ నాగేశ్వరరావు విస్తృత పర్యటన
== స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఎంపీ నామ.
కూసుమంచి, జూన్ 06(విజయంన్యూస్)
ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని టీ.ఆర్.ఎస్ లోక్ సభాపక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు. సోమవారం ఉదయం పాలేరు నియోజకవర్గం కూసుమంచి, తిరుమలాయపాలెం మండలాల్లో ఆయన పర్యటించారు. అందులో భాగంగా ముందుగా నాయకన్ గూడెం గ్రామంలో టీ.ఆర్.ఎస్ నాయకులు కంచర్ల వీరారెడ్డి, ఎంపీపీ కంచర్ల పద్మారెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన తేనేటి విందుకు హాజరై అక్కడ ఉన్న నాయకులు, ప్రజాప్రతినిధులతో ముచ్చటించారు. వారితో ఎంపీ నామ మాట్లాడుతూ జిల్లా అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్,రాష్ట్ర మంత్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల నాయకత్వం లో ఉమ్మడి ఖమ్మం జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని, వారి సహకారంతో ఎంపీ గా తను పలు మండలాల్లో కోట్ల రూపాయల తో పి.ఎం.జి.ఎస్.వై క్రింద లింక్ రోడ్లను ఇప్పటికే మంజూరు చేపించడం జరిగిందని తెలిపారు. అలానే గ్రామాల్లో అంతర్గత రోడ్లను సీసీ రోడ్లగా మార్చేందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలు గ్రామాలకు ఈజీఎస్ నిధులను మంజూరు చేయించడం జరిగిందని గుర్తు చేశారు. ప్రస్తుతం సెంట్రల్ రోడ్స్ ఫండ్స్ సీఆర్ఐఎఫ్ నుండి జిల్లాకు రూ.30 కోట్లు మంజూరు అయ్యాయని, త్వరలోనే వాటికి సంబంధించిన అభివృద్ధి పనులు మొదలవుతాయని ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి, సంక్షేమం లో దేశానికే ఆదర్శంగా ఉందని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి : – పార పట్టి.. రోడ్డు పై డామర్ వేసిన మంత్రి పువ్వాడ
అలానే గ్రామంలో ఇటీవల వివాహాలు జరిగిన గ్రామ వార్డు మెంబెర్ పకాలపాటి సుజాత కుమారుడు సురేష్ దంపతులను, కిన్నెర వెంకన్న కుమారుడు అనేష్ దంపతులను ఆశీర్వదించారు. అనంతరం నర్సింహులగూడెం గ్రామానికి చేరుకొని ఇటీవల మరణించిన నాయిని లక్ష్మీమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అక్కడ నుండి తురకగూడెం గ్రామానికి చేరుకొని గ్రామ సర్పంచ్ కన్నెబోయిన కౌసల్య, లింగయ్య దంపతుల కుమార్తె త్రిష పుట్టువెంట్రుకల కార్యక్రమానికి హాజరై చిన్నారిని ఆశీర్వదించారు. అనంతరం తిరుమలాయపాలెం మండలంలోని బచ్చోడు గ్రామానికి చేరుకొని అక్కడ జరుగుతున్న గంగమ్మ జాతర లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడ నుండి బీరోలు గ్రామానికి చేరుకొని గ్రామ తెరాస పార్టీ కార్యదర్శి జానీబాబా తండ్రి దస్తగిరి అనారోగ్యంతో బాధపడుతున్నారు అని తెలుసుకుని వెళ్లి పరామర్శించారు అలానే గ్రామంలో సీనియర్ నాయకులు యామిని మార్కడాయ్య గారి ఇంటికి వెళ్లి వారితో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. అలానే గ్రామ సర్పంచ్ వంచర్ల అలివేలమ్మ భర్త కు ఇటీవల సర్జరీ జరగగా వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. అలానే అదే గ్రామంలో ఇటీవల వివాహ జరిగిన మత్య సహకార సంఘం డైరెక్టర్ బయ్య మల్లయ్య కుమార్తె దంపతులను ఆశీర్వదించారు.
allso read- ఘనంగా కూసుమంచి ఎంపీపీ పుట్టిన రోజు వేడుకలు
అనంతరం జల్లెపల్లి గ్రామంలో ఇటీవల మరణించిన పొట్టబత్తిన సైదులు నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి పరామర్శించారు. అలానే కేశవాపురం గ్రామంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన దొడ్డ ఉపేందర్ నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమాల్లో రైతు బంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, డీసీసీబీ డైరెక్టర్ శేఖర్, కూసుమంచి ఎంపీపీ బానోతు శ్రీనివాస్ నాయక్, మద్దులపల్లి, నేలకొండపల్లి మార్కెట్ కమిటీ ల చైర్మన్ లు, వడ్తియా సెట్రామ్ నాయక్, తిరుమలాయపాలెం మండల పార్టీ అధ్యక్షులు బాసబోయిన వీరన్న, వైస్ ఎంపీపీ కంచర్ల పద్మారెడ్డి, ఎంపీటీసీ జర్పులా బాలాజీ నాయక్, టెలికాం అడ్వైజరీ కమిటీ మెంబర్ చిత్తారు సింహాద్రి యాదవ్, టెలికాం అడ్వైజరీ కమిటీ మెంబర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఉప్పనూతల నాగేశ్వరరావు, సర్పంచ్ లు కాసాని సైదులు, బానోతు కిషన్, బి.రవి, బానోతు నాగేశ్వరరావు, మల్లీడు వెంకటేశ్వరరావు, జర్పుల బిక్ష్మం, తిరుమలాయపాలెం మండలం లో సర్పంచ్ లు పుల్లూరు యకమ్మా నాగరాజు, అలావత్తు జ్యోతి శ్రీనివాస్, బానోతు రమేష్, దారవత్ భిక్షం, మోహిని వెంకన్న, ఎంపీటీసీ దారవత్ శంకర్, విద్యా కమిటీ చైర్మన్ గుంటి ప్రసాద్, వేదం హరిహర కుమార్ సహా పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.