Telugu News

నేలకొండపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఓ కుటుంబం ధర్నా

పాస్ బుక్ కోసం పదేళ్ళనుంచి తిప్పుతున్నారని ఆందోళన

0

నేలకొండపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఓ కుటుంబం ధర్నా

** పాస్ బుక్ కోసం పదేళ్ళనుంచి తిప్పుతున్నారని ఆందోళన

** సమస్యపరిష్కరిస్తామని హామినిచ్చిన అధికారులు

(నేలకొండపల్లి/కూసుమంచి-విజయం న్యూస్)

ఖమ్మం జిల్లా
నేలకొండపల్లి తహశీల్దార్ కార్యాలయం ఎదుట రాజేశ్వరపురం గ్రామానికి చెందిన అరుణ అనే మహిళ మంగళవారం తన కుమారులతో ఆందోళన చేసింది. తమకు వారసత్వం గా వస్తున్న మునగంటి. పుల్లయ్య కు ఎకరం మూడు కుంటల భూమికి పాస్ బుక్ ఇప్పించి తమకు న్యాయం చేయాలని కోరుతూ గత పది సంవత్సరాలుగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించింది.. ఇంకేన్నాళ్ళు ఆఫీస్ చుట్టు తిరగాలని గొడవ చేసింది..

allso read-రాజ్యసభ సభ్యుడిగా వద్దిరాజు రవిచంద్ర

మాకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటామని పేర్కొన్నారు. కుమారులతో కలిసి కార్యాలయం ముందు మంచం మీద పండుకొని నిరసన తెలియజేశారు. దీంతో సమాచారం అందుకున్న నేలకొండపల్లి తహశీల్దార్ బాధిత కుటుంబాన్ని లోపలకు పిలిపించి న్యాయం చేస్తానని హామినిచ్చినట్లు తెలిసింది. అయితే రెవెన్యూ అధికారులు పదేళ్ళుగా ఆ నిరుపేద కుటుంబాన్ని పదేళ్లుగా ఎందుకు తాసిల్దార్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయించుకుంటున్నారో అర్థం కానీ విషయం. అయితే ఈ విషయంపై జిల్లా ఉన్నతాధికారులు విచారణ చేపట్టి తగు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. మరీ.. అధికారులు బాధితులకు న్యాయం చేస్తారా ఏం జరగబోతుందో వేచి చూడాల్సిందే