Telugu News

ప్రజా ద్రోహి ఎమ్మెల్యే కందాల.. సీఎల్పీ లీడర్ ఘాటు విమ్మర్శ

సభ్యత్వ నమోదులో నెంబర్ వన్స్థానంలోఖమ్మంను నిలబెట్టండి

0

*ప్రజా ద్రోహి ఎమ్మెల్యే కందాల*

*కాంట్రాక్టుల కై ప్రజల నమ్మకాన్నితాకట్టు*

*అవకాశవాద పార్టీలు టిఆర్ ఎస్, బిజెపి*

*తాగ్యాల చరిత్ర కాంగ్రెస్ సొంతం*

*సభ్యత్వ నమోదులో నెంబర్ వన్
స్థానంలోఖమ్మంను నిలబెట్టండి*

*నేలకొండపల్లి, కూసుమంచిలో కాంగ్రెస్ శ్రేణులకు భట్టివిక్రమార్క దశ దిశ నిర్ధేశం*
(ఖమ్మం ప్రతినిధి-విజయం న్యూస్)
ఓట్లు వేసి గెలిపించిన ప్రజల నమ్మకాన్ని కాంట్రాక్టుల కోసం అధికార పార్టీ వద్ద తాకట్టు పెట్టిన పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి ప్రజా ద్రోహి అని తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క తీవ్రంగా విమర్శించారు.నియోజకవర్గ ప్రజల గొంతుకగా అసెంబ్లీలో ప్రజా సమస్యలను ప్రస్తావించాల్సిన ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి దొరగడీల వద్ద కాపాల ఉన్నాడని ఎద్దేవా చేశారు.

allso read:- *రైతులకోసం జనవరి 9నుంచి పాదయాత్ర చేస్తా: భట్టి

శుక్రవారం నేలకొండపల్లి మండల కేంద్రంలో జరిగిన పాలేరు నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం, పార్టీ సభ్యత్వ నమోదు అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిఎల్ పి లీడర్, మధిర శాసనసభ్యులు శ్రీ భట్టి విక్రమార్క మల్లు గారికి కాంగ్రెస్ కార్యకర్తలు కోలాటాలు, మేళతాళాలతో ఘన స్వాగతం పలికారు కాంగ్రెస్ పార్టీని, నియోజకవర్గ ప్రజలను మోసం చేసిన కందాలకు వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని హెచ్చరించారు.కందాల ఉపేందర్ మాధిరిగానే కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని టిఆర్ పార్టీలు అవకాశవాద రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు.అధికారం కోసం గడ్డీకరిచే సంస్కృతి కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు.

alldo read:- వేటు పడేనా..!? వైదొలిగేనా…?! – మాజీ ఎంపీ పయనమెటు…?

వ్యవసాయ ప్రాంతమైన పాలేరులో వరి పండించే రైతుల పక్షాణ ఎమ్మేల్యే నోరువిప్పకపోవడం తగదన్నారు.

యాసంగిలో వరి కొంటామన్న భరోసాను ఇవ్వని ఎమ్మెల్యే మనకు అవసరమా? అని ప్రశ్నించారు. వరి వేయోద్దని అధికారులు ఊరురా తిరుగుతూ రైతులను భయపెడుతుంటే ఎమ్మెల్యే ఎక్కడ ఉన్నాడని ప్రశ్నించారు.

కాంగ్రెస్ పార్టీకి త్యాగాల చరిత్ర ఉందని వివరించారు.
దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన మహానీయులను అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీదని తెలిపారు.తూపాకి తూటకు ఎదురొడ్డి దేశ స్వాతంత్య్రం కోసం పోరాడి దేశ ప్రజలకు స్వేచ్ఛ కల్పించింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు.స్వేచ్ఛతో కూడిన ప్రజాస్వామ్య పాలన అందించడం వల్లనే టిఆర్ బిజెపి పార్టీలు ఈదేశంలో ఉన్నాయన్నారు.ఇప్పుడు వారు అవలంభిస్తున్నట్టు నియంతృత్వ, నిర్భంద పోకడలను కాంగ్రెస్ పార్టీ అవలంభిస్తే ఆపార్టీలు ప్రస్తుతం కనుచూపుమేరల్లో కూడ ఉండేవి కావన్నారు. ప్రజాస్వామ్య పరిపాలన చేయడమే కాంగ్రెస్ సిద్ధాంతమని అన్నారు.

ఇలాంటి పార్టీలో సభ్యుడిగా చేరడమంటే అదృష్టంగా భావించాలని సూచించారు. రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు దేశంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ డిజిటల్ సభ్యత్వ నమోదు నడుస్తున్నదని, ఆదే స్పూర్తితో ఖమ్మంలో జిల్లాలో విస్త్రతంగా చేపట్టి రాష్ట్రంలో జిల్లాను నెంబర్ వన్ స్తానంలో నిలబెట్టాలి