ఖమ్మం సాగర్ కాలువలో ముగ్గురు యువకులు గల్లంతు
గాలింపు చేపట్టిన పోలీసులు
(ఖమ్మం ప్రతినిధి- విజయంన్యూస్)
ఖమ్మం నగరంలోని దాన్వాయిగూడెంలో విషాదం నెలకొంది. దాన్వాయిగూడెం వద్ద ఉన్న సాగర్ కాలువలో ముగ్గురు యువకులు ఈతకెళ్లి గల్లంతైయ్యారు. సరదా కోసం ఈతకు వెళ్లిన వారు గల్లంతైయినట్లు స్థానికులు చెబుతున్నారు. కేరళ ఆయుర్వేద ఆసుపత్రిలో పనిచేస్తున్న కేరళ రాష్ట్రానికి చెందిన 7గురు యువకులు సాయంత్రం సమయంలో ఈతకు వెళ్లారు. అందులో సోను, అభయ్ తో పాటు మరో యువకుడు గల్లంతు అయినట్లు తెలుస్తోంది. నలుగురు క్షేమంగా బయటకు వచ్చినట్లు సమాచారం. యువకులు పెద్ద ఎత్తున కేకలు వేయడంతో స్థానికులు రక్షించే ప్రయత్నం చేసిన ఫలితం లేకపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గాలింపు చేపట్టారు. ఈ మేరకు బయట ఉన్న యువకలు వద్ద నుంచి పోలీసులు వివరాలు తీసుకున్నారు.