Telugu News

అ‘సమ్మతేనా’..?ఖమ్మం గుమ్మంలో రాజకీయ గందరగోళం..

ఆ ముగ్గురు కలిసిండ్రూ.. ఎందుకోసం..?

0

అ‘సమ్మతేనా’..?

== ఆ ముగ్గురు కలిసిండ్రూ.. ఎందుకోసం..?

== ఒక్కటైయ్యేందుకా..? కలిసిపోయేంటందుకా..?

== ఖమ్మం గుమ్మంలో రాజకీయ గందరగోళం..

==హాట్ టాఫీక్ గా మారిన ముగ్గురు మాజీల కలియక

== అదేం లేదంటున్న ఆ ముగ్గురు..

== వేడేక్కుతున్న రాజకీయం

( ఖమ్మం ప్రతినిధి, చంద్రుగొండ- విజయం న్యూస్):

ఎన్నికల వాతావరణం షూరు అయ్యింది.. ముందస్తు ఎన్నికలు కచ్చితంగా వస్తాయనే ఆలోచనలో ఉన్న నేతలు ముందుగానే మెల్కోంటున్నారు.. తమ భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకుంటున్నారు.. అసమ్మత్తులు ఐక్యమైయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.. అవసరమైతే వేరే కుంపటిపెట్టడమా.. లేదంటే ఉన్న పార్టీలోనే బలం నిరూపించుకోవడమా..? అనే విషయాల్లో అగ్రనేతలందరు చర్చించుకుంటున్నారు.. మన భవిష్యత్ ఇంతేనా..? లేదంటే షాకులివ్వాల్సిందేనా..? అని చర్చించుకుంటున్నారు..  అందుకు తగ్గట్లుగా రూట్ మ్యాఫ్ తయారు చేసుకుంటున్నారు.. అందులో భాగంగానే కొందరు అసమ్మతి నేతలు ఐక్యమవుతున్నట్లు కనిపిస్తోంది.. సీఎం కేసీఆర్ పై రెపరెండం ప్రకటించడమా..? లేదంటే వేరే దారి చూసుకోవడమా..? అనే విషయాల్లో ఆ  నేతలు చర్చించుకుంటున్నట్లు తెలుస్తోంది.. అందుకు ప్రధానంగా ఖమ్మం జిల్లా ఊతమైంది.. ఫలితంగా ఖమ్మం గుమ్మంలో రాజకీయ గందరగోళం ఏర్పడింది.. ఆ ముగ్గురు ఎందుకు కలిశారు.. ఉత్కంఠ సమయంలో కలవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది.. మర్యాద పూర్వకంగా కలిశారా..? లేదంటే పనిగట్టుకుని వచ్చి కలిశారా..? అనే విషయంపై సర్వత్ర ఉత్కంఠ నేలకొంది..  ఆ ముగ్గురి కలియకపై ‘విజయం’ తెలుగుదినపత్రిక ప్రతినిధి అందిస్తున్న ప్రత్యేక కథనం..

 

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఒక్క సారిగా వేడెక్కాయి. అసలే ముందస్తు ఎన్నికలు అంటూ ఊహాగానాలు నేపథ్యంలో ముగ్గురు రాష్ట్ర స్థాయి నాయకులు సమావేశం అవ్వడం తీవ్ర సంచలనం గా మారింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అదే చర్చ..  ఆముగ్గురు ఎందుకు కలిశారు.. ఏం మాట్లాడుతుకున్నారు..? ఏం చేయబోతున్నారు..? అధికార పార్టీలో ఉంటారా..? అసమ్మతి  రాజేసీ అసంతప్తి వాధులన్నందర్ని ఐక్యం చేసి బయటకు వెళ్తారా..? రాష్ట్రంలో ఏం జరగబోతుంది అని సర్వత్ర చర్చ జరుగుతోంది.. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతల పట్ల జరుగుతున్న రాజకీయ సమీకరణ మార్పుల పై చర్చ జరుగుతోంది.. శీనన్న పోతే సినిమా అంతా సీతారే అంటూ కొందరు సోషల్ మీడియాలో పెడితే అభివద్దికే అందం తెచ్చిన తుమ్మల పోతే కారు పార్టీ తూడుచుకపెట్టుకొని పోవడం ఖాయమంటూ కొందరు పోస్టులు చేస్తున్నారు.. వీటికే ఎక్కువ లైక్ లు పడుతున్న పరిస్థితి ఏర్పడింది.. అసలు ఇంత సోదేంది..? అసలు విషయం చెప్పండి అనుకుంటున్నారా..? అయితే తప్పకుండా రేపటి విజయం పత్రిక చదవండి..?