Telugu News

 పెంచిన బస్ చార్జీల తక్షణమే తగ్గించాలని మంత్రి ఇల్లుముట్టడించిన పీడీఎస్ యు

అడ్డుకున్న పోలీసులు.. తోపులాట.. అరెస్టు.. 

0

పెంచిన బస్ చార్జీల తక్షణమే తగ్గించాలని మంత్రి ఇల్లుముట్టడించిన పీడీఎస్ యు

== అడ్డుకున్న పోలీసులు.. తోపులాట.. అరెస్టు..

ఖమ్మం, జూన్ 18(విజయంన్యూస్)

ఆర్టీసీ పెంచిన విద్యార్థుల బస్ పాస్ చార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ  పీడీఎస్ యు, పీవైఎల్ నాయకులు  శనివారం రోడ్డు రవణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఇల్లును ముట్టడించారు. దీంతో పోలీసులు అడ్డుకోగా, నాయకులు, కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. కాగా పోలీసులు విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పి.డీ.ఎస్.యు పీ వై ఎల్ ఖమ్మం జిల్లా అధ్యక్ష కార్యదర్శి కోళ్ల లక్ష్మీనారాయణ జి మస్తాన్ ఆర్ క్రాంతి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సామాన్యులకు దూరపు ప్రాంతాలకు ప్రయాణం చేయడానికి ఇష్టపడేటటువంటి ఆర్టీసీ బస్ చార్జీలను ఈ సంవత్సరం 4 సార్లు పెంచుతూ పేద ప్రజలకు ప్రయాణం భారంగా చేశారు. విద్యార్థులకు సంబంధించి వేలాదిమంది గ్రామీణ ప్రాంతాల నుండి విద్యార్థులు చదువుకునేందుకు వివిధ ప్రాంతాలకు బస్ పాస్ లతో ప్రయాణం చేస్తుంటారు. విద్యార్థులు , వారి తల్లిదండ్రులకు ఆర్థిక భారాన్ని పెంచే విధంగా ఉంది .

allso read- ఆ ఇద్దరికి చెక్ పెట్టేందుకేనా..?

పెరిగిన చార్జీల భారం సామాన్య ప్రజల ప్రయనంతో పాటుగా విద్యార్థుల బస్ పాసుల పై పడిందని దీనితో విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నయి .గతంలో ఉన్న బస్ పాసుల ధరలకే చాలామంది విద్యార్థులు చదువులకు దూరం అయ్యారని గుర్తుచేశారు. 165 రూపాయల ఉన్న బస్ పాస్ ధర ఇప్పుడు 450 కి పెరిగిందని అలాగే 200 పాస్ 600 కి,245 పాస్900 కి,280 ఉన్న పాస్ ధర 1150 కి అమాంతం పెరిగిపోయిందని తెలిపారు. కాబట్టి గ్రామీణ విద్యార్థులకు ఆర్థిక భారాన్ని పెంచే టీఎస్ ఆర్టీసీ,  పెంచిన విద్యార్థుల బస్ పాస్ అధిక చార్జీలను వెంటనే తగ్గించి విద్యార్థులకు న్యాయం చేయాలని , లేకపోతే ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ప్రగతి శీల యువజన సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులతో యువకులతో మరిన్ని ఉద్యమాలు చేస్తామని,  ఒక్క బస్ లను కూడా నడవనియమని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్యు ఖమ్మం జిల్లా సహాయ కార్యదర్శి ఉపేందర్, జైదీప్ తదితరులు పాల్గొన్నారు