‘పాలేరు’ లో మరో రాఘవుడున్నాడా..?
== విత్తనాల విక్రయాల నుంచి నామినేటేడ్ పోస్టు వరకు
== షెటల్ మెంట్లు…దందాలు.. పంచాయతీలు..
== రియల్ ఎస్టేట్ భూములలో కమీషన్లు
== ప్రభుత్వ పనులన్ని ఆయన పరమే
== అధికారమే పరమావధిగా రాజకీయం.
==ఐదేళ్లలోనే హైటెక్ రేంజీకి..
== నేతల మాటున నైజాం పాలన
== ఆయనంటేనే జనంకు భయంభయం..
== ఎదురుమాట్లాడితే బెదిరింపులు.. అడ్డం వస్తే విధుల తొలగింపుకు యత్నం
== ఎక్కడ కేసుల్లో కనపడడు.. కేసులు పెట్టే దైర్యం కూడా లేదు..?
== ఆయనేక్కడున్న వర్గపోరు తప్పదు
== ఇంతకు ఆయనేవ్వరు..?
(కూసుమంచి-విజయంన్యూస్)
ఆయనో రాజకీయ నాయకుడు.. ఎమ్మెల్యే కాదు.. ఎమ్మెల్యే తనయుడు అంతకంటే కాదు.. మంత్రులకు, మహానాయకులకు బందువు కాదు.. కానీ అతితక్కువ కాలంలోనే హైటెక్ రేంజీకి ఎదిగాడు.. ప్రభుత్వ ఉద్యోగి కాదు.. ప్రభుత్వ అదినేత కు దగ్గరబందువుకాదు.. భూములు అమ్మలేదు.. అస్తులన్న కుటుంబ వ్యక్తి కాదు.. పదేళ్ల క్రితం మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి.. ఇప్పుడు హైటెక్ రేంజీ.. కోట్లాధిపతిగా మారిన ఆ నాయకుడు.. అన్నింట్లో తనదే పైచెయ్యి.. అనుకున్నది సాధించడంలో ఆయన రూటే సపరేట్.. అవసరమైతే ఏ పనిచేయడానికైనా వెనకాడేది లేదు.. రియల్ వ్యాపారంలో కమీషన్లు.. షెటిల్ మెంట్లు.. పంచాయతీలు.. భూదందాలు.. ఒక రకంగా చెప్పాలంటే నేతల మాటున నైజాం పరిపాలన.. ఆయనంటే జనంకు భయం.. ఆయన చెప్పిందే వేదం.. ఆయన మాటకు తిరుగులేదు.. ఎదురుమాట్లాడితే బెదిరింపులు..అడ్డం వస్తే విధుల నుంచి తొలగింపు.. ఆయనేక్కడున్న వర్గపోరే..? సాధాహరణ కార్యకర్త నుంచి జిల్లా ప్రజాప్రతినిధి రేంజి.. అడిగిన వారికళ్లా సహాయం.. అందులో ఉంటుంది అద్భుతమైన మతలబు.. కనిపెట్టేవారిపై ఆయనకు కనికరం ఉండదు.. సందుకోసం చూసి సర్వనాశనం చేయాలని చూస్తుంటాడు.. ఆయనకు ఎదురుపోయేవారు లేరు.. ఆయనకిప్పుడు అదష్టం ఆరుపాదాలపై నడుస్తోంది. ఆయన్ను ఇప్పుడు అడ్డుకునే పరిస్థితుల్లో లేరు.. ఆయన చేసిన పనికి అందరు సలామ్ కొట్టాల్సిందే.. అటు అధికారులైనా..? ప్రజలైనా..? అంతలా సాగుతోంది ఆయన నాయకత్వం.. ఒక విధంగా చెప్పాలంటే ఒక్క అలవాటు తప్ప అన్ని పిన్ టూ పిన్.. అచ్చు ’రాఘవ‘ టైపే..? ఆడవారంటే మర్యాదే.. కానీ నమ్మిన వారిని బొందేపెట్టే రకం.. నటించడంలో ఆయన ఎన్టీవోడ్ తరువాతనే.. ఆయన్ను నమ్మినోళ్లు పోలాల గట్ల మధ్య తిరుగుతున్నరు.. ఆయనతో తిరిగినోళ్లు ఇంటికే పరిమితమైయ్యారు.. ఆయన నమ్మిన పార్టీని నట్టెట ముంచేసి, పక్కపార్టీలో చేరి వంతబలుకుతున్నడు.. ఆయనేవ్వరో అసక్తిగా చూడాలని ఉందా..?అయితే పూర్తి వివరాలు ఈ రోజు విజయం దినపత్రిక ఖమ్మం ఎడిషన్ చూడండి..
Allso read:- వనమా రాఘవ రిమాండ్