Telugu News

ఖమ్మంలో ఆవుల సుబ్బారావు అరెస్టు

సికింద్రాబాద్ విద్యార్థి ఉద్యమానికి వ్యూహకర్తగా పోలీసుల అనుమానం

0

సుబ్బారావు ఖమ్మంలో అరెస్టు

== సికింద్రాబాద్ విద్యార్థి ఉద్యమానికి వ్యూహకర్తగా పోలీసుల అనుమానం 

== పక్కా అధారాలతో అరెస్టు చేసి నర్సరావుపేట కు తరలింపు

ఖమ్మం ప్రతినిధి, జూన్ 18(విజయంన్యూస్)

రైల్వే స్టేషన్ విధ్వంసానికి వ్యూహకర్త ఆవుల సుబ్బారావు ఖమ్మంలో అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్  విధ్వంసానికి  ఆయనే వ్యహకర్తగా వ్యహరించారని అనుమానిస్తున్న పోలీసులు, సంఘటన జరిగిన తరువాత పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. ఈ మేరకు ప్రధాన అనుమానితుడిగా సుబ్బారావును పోలీసులు ఖమ్మంలో అరెస్టు చేసి నర్సరావుపేటకు తరలించినట్లు తెలుస్తోంది.  పూర్తి వివరాల్లోకి వెళ్తే ఆర్మి ఉద్యోగాల ప్రకటన విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అగ్నిపథ్ పై యువకులు తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారు. ఈ సందర్భంలో గత మూడు రోజులుగా ఒక వాట్సఫ్ కేంద్రంగా యువకులందరు ఐక్యమైనట్లు తెలుస్తోంది. ఈ గ్రూపు క్రియేట్ చేయడం, యువకులందురు  ఐక్యమై ఒకే సారి రైల్వే స్టేషన్లపై ధర్నా చేయాలని భావించి శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను వేలాధి మంది యువకులు ముట్టడి చేశారు. చాలా విద్యాంసం చేశారు. రైళ్లను తగలబెట్టారు, మోటర్ సైకిళ్లను తగలబెట్టారు. ఎక్కడిక్కడ పగలగొట్టి ద్వంసం చేశారు. దీంతో పోలీసులు కాల్పులు జరపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనలో ఒకరు చనిపోగా, 15మంది వరకు తీవ్రగా గాయపడ్డారు. వారందరు గాంధీ అసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ విషయంపై సీరియస్ గా తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.  ఇంతమంది విద్యార్థులు ఎక్కడ నుంచి వచ్చారనే విషయంపై అరా తీశారు. ఈ విద్వాంసానికి కారణం  వ్యక్తి అని అనుమానించిన పోలీసులు అందుకు సోషల్ మీడియాను ఆసరగా చేసుకుని విచారణ చేపట్టారు.  కాగా విద్యార్థులందర్ని ఐక్యం చేసే విషయంలో నర్సారావుపేటకు చెందిన సాయి డిఫెన్స్ అకాడమీ అధినేత ఆవుల సుబ్బారావు ప్రధాన కీలక వ్యక్తిగా భావించిన పోలీసులు అరెస్టు చేసేందుకు పైఅధికారులు ఆదేశించారు. హకీంపేట ఆర్మీ సోల్జర్స్ పేరుతో 13 వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసి విద్యార్థులను రెచ్చగొట్టి స్టేషన్ పై దాడికి పక్కా ప్లాన్ వేసినట్లుగా సమాచారం సేకరించిన నిఘాబృందం, పై అధికారుల ఆదేశాల మేరకు శనివారం తెల్లవారు జామున సుబ్బారావును ఖమ్మం సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు  తెలుస్తుంది. ఆయన్ను నర్సరావుపేటకు తరలిస్తున్నట్లు సమాచారం.

allso read-  పెంచిన బస్ చార్జీల తక్షణమే తగ్గించాలని మంత్రి ఇల్లుముట్టడించిన పీడీఎస్ యు