Telugu News

పోలీసులు.. సైకిల్ ఎక్కారు.. ఎందుకోసమంటే..?

తప్పు చేస్తే తప్పకుండా చూపిస్తామంటున్నారు..?

0

పోలీసులు.. సైకిల్ ఎక్కారు.. ఎందుకోసమంటే

== తప్పు చేస్తే తప్పకుండా చూపిస్తామంటున్నారు..?

== ఏంటది..?

ఖమ్మం ప్రతినిధి, జూన్ 25(విజయంన్యూస్)

ప్రజలకు శాంతిభద్రతలను కాపాడటమే కాకుండా ప్రజలకు మేలు చేసే కార్యక్రమంలో అంతేకాదు ప్రజాశ్రేయస్సులో అన్నింట ముందుండే పోలీసులు వారి వాహనాలను కొద్దిసేపు పక్కనబెట్టారు.. సైకిలేక్కి ర్యాలీ నిర్వహించారు.  నగరంలో, మండల కేంద్రాల్లో పర్యటించారు.. అక్రమ రవాణా చాలా తప్పు..  తప్పు చేయోద్దని వేడుకున్నారు.. తప్పు చేస్తే ఏం చేయాల్నో చూపిస్తమన్నారు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే

ALLSO READ- తమ్ముడు చేతిలో అన్న దారుణ హత్య…!

సమాజంలో మాదక ద్రవ్యాల ప్రభావం లేకుండా చేసేందుకు ప్రతిఒక్కరూ ముందుకు రావాలని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ పెర్కొన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నగరంలోని మయూరి సెంటర్ నుండి లకారం ట్యాంక్ బండ్ వరకు సైకిల్ ర్యాలీ  నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్  మాట్లాడుతూ యువత ఎటువంటి మత్తు పదార్థాలకు లోనుకావొద్దని, ఉద్యోగాల సాధనకు కృషి చేసి వ్యక్తిగత జీవితానికి బంగారు బాట వేస్తూ తల్లితండ్రులకు, సమాజానికి మేలు చేయాలన్నారు.  ప్రతి విద్యార్థీ మాదక ద్రవ్వాలపై అవగాహన చేసుకుని మరో వంద మందికి చైతన్యపరచాలని కోరారు.  మాదక ద్రవ్యాలను పూర్తిగా అరికట్టి మాధకద్రవ్యాల రహిత జిల్లాగా ముందుకు తీసుకేల్సిన భాధ్య

త మన అందరిపైన ఉందని అన్నారు. చెడు వ్యసనాలకు బానిసైతే వారి కుటుంబాలు చిన్నా భిన్నం ఆవుతాయని గ్రహించాలని అన్నారు.  డ్రగ్స్‌, గంజాయి, కొకేన్‌ లాంటివి మీ చుట్టుపక్కల వారు విక్రయించినా, వాడుతున్నట్లు తెలిసినా తక్షణమే తమకు సమాచారం అందిస్తే పూర్తి స్థాయిలో అరికడతామన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం, రవాణా, కలిగి యుండడం వల్ల ఒక వ్యక్తికి కలిగే దుష్పరిణామాలు, చట్టపరమైన శిక్షలు, సామాజిక వెలివేత వంటి అంశాలపై గత రెండు రోజులుగా యువతకు, విద్యార్థులకు అవగాహన   కల్పించామని తెలిపారు. కల్లూరు డివిజన్ లో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని కల్లూరు డివిజన్ లో ఏసీపీ వేంకటేశ్ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. అలాగే వైరా డివిజన్ వైరా డివిజన్ పరిధిలో ఏసీపీ సాదన రస్మీ పెరుమాళ్ ఆధ్వర్యంలో జెండా ఊపీ మోటార్ సైకిల్ ర్యాలీ ప్రారంభించారు. ఖమ్మం రూరల్ డివిజన్ పరిధిలో ఏసీపీ భస్వారెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మీన్ శభరీష్, అడిషనల్ డీసీపీ లా&ఆర్డర్ సుభాష్ చంద్ర బోస్ ,ఏఆర్ అడిషనల్ డీసీపీ కుమారస్వామి, ఏసీపీలు రామోజీ రమేష్ , అంజనేయులు, భస్వారెడ్డి, ప్రసన్న కుమార్, సిఐలు ఎస్సైలు ,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.