Telugu News

ఏ ఒక్క టీచర్ కు అన్యాయం జరిగిన ఊరుకోం… ఖమ్మం డీఈవో కార్యాలయం ఎదుట పీఆర్ టీయు ధర్నా

డీఈవోకు వినతి పత్రాన్ని అందించిన ఉపాధ్యాయ సంఘాల నాయకులు

0

ఏ ఒక్క టీచర్ కు అన్యాయం జరిగిన ఊరుకోం :పీఆర్ టీయు
** ఖమ్మం డీఈవో కార్యాలయం ఎదుట ధర్నా
** డీఈవోకు వినతి పత్రాన్ని అందించిన ఉపాధ్యాయ సంఘాల నాయకులు
(ఖమ్మం ప్రతినిధి –విజయంన్యూస్)
జిల్లాలకు కొత్తగా క్యాడర్ సీనియారిటీ ఆధారంగా పోస్టుల కేటాయింపు పేరుతో ప్రభుత్వం జారీ చేసిన 317 ఉత్తర్హులు ఉపాధ్యాయుల పాలిట శాపంగా మారిందని పీఆర్ టీయు జిలాల అధ్యక్షుడు మోతుకూరి మధు, ప్రధాన కార్యదర్శి ఆర్.రంగరావు పేర్కొన్నారు. ఏ ఒక్క ఉపాధ్యాయుడుకి నష్టం జరిగిన తాము ఊరుకునేది లేదని వారు హెచ్చరించారు. శుక్రవారం ఖమ్మం డీవో కార్యాలయం ఎదుట పీఆర్ టీయు జిల్లాశాఖ ఆధ్వర్యంలో 317 డీఓను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో విభజన పేరుతో స్థానికతతో సంబంధం లేకుండా వేలాధి మంది ఉపాధ్యాయులకు స్థానచలనం చేయడం వల్ల జిల్లాలోని 10వేల కుటుంబాల్లో తీవ్ర ఆందోళన నెలకొందని తెలిపారు. సీనియారిటీ జాబితాలోని తప్పులను సవరించాలని, స్పాజ్ క్యాటగిరీ వారికి ప్రాధాన్యత ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం డీఈవోకు వినతి పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో పీఆర్ టీయు రాష్ర్ట జిల్లా బాధ్యులు వై.వెంకటేశ్వర్లు, విజయ్ అమతకుమార్, కట్టా శేఖర్రావు, బ్రహ్మారెడ్డి, రెబ్బ శ్రీనివాస్, వెంకటేశ్వర్ రెడ్డి, మోహన్ రెడ్డి, సైదయ్య, సోమ్లా, వినోద్, చెన్నకేశవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ALLSO READ :- ఆర్ డి వో లను సిడివొ లుగా మార్పు..? త్వరలోనే రెవెన్యూ లొ మరో ప్రక్షాళన