Telugu News

ప్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ లో దంచికొట్టిన కూసుమంచి సీఐ సతీష్

44బంతుల్లో 53 రన్స్ చేసి పోలీస్ టీమ్ గెలిపించిన సీఐ

0

ప్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ లో దంచికొట్టిన కూసుమంచి సీఐ సతీష్

** 44బంతుల్లో 53 రన్స్ చేసి పోలీస్ టీమ్ గెలిపించిన సీఐ

** ముఖ్య అతిథిగా హాజరైన పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్ వారియర్

*ఫ్రంట్ లైన్ వారియర్స్ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్*

(ఖమ్మం ప్రతినిధి-విజయం న్యూస్)

ఖమ్మం జిల్లా ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన డాక్టర్స్ & పోలీస్,రెవెన్యూ , మీడియా టీమ్ ల మధ్య ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ఉల్లాసంగా సాగింది. గత కొద్ది రోజులుగా నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో కొనసాగుతున్న ఉమెన్ టీ20 క్రికెట్ లిగ్ 2022 డే&నైట్ క్రికెట్ మ్యాచ్ లకు సందర్భంగా డాక్టర్స్ & పోలీస్ వారియర్ టీమ్ ల మధ్య ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ జరిగింది. పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్, డా. కూరపాటి ప్రదీప్ కెప్టెన్లు గా పాల్గొన్నారు.

టాస్ గెలిచి మొదటగా బ్యాటింగ్ చేసిన పోలీసు జట్టు నిర్ణీత 20 ఓవర్లకు 158/4 పరుగులు చేయగా  అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన డాక్టర్ వారియర్ జట్టు పది వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేయడంతో పోలీస్ జట్టు విజయం సాధించింది.
ఇరు జట్లు పోటా పోటీగా తలపడటంతో మ్యాచ్ ఆసక్తిని రేకెత్తించింది. ఈ టీమ్ లో కూసుమంచి సీఐగా పనిచేస్తున్న సతీష్ 53, గౌస్ 30, సీపీ విష్ణు ఎస్ వారియర్ 16పరుగులు చేశారు. ఆఫ్ సెంచరీ చేసిన సీఐను సీపీ , తోటి సిబ్బంది అభినంధించారు.

అంతకు ముందు మీడియా వర్సెస్ రెవెన్యూ డిపార్ట్‌మెంట్ కు జరిగిన పోటీలో మీడియా టీమ్ విజయం సాధించారు. వారిని పోలీస్ కమిషనర్ అభినందించారు.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ క్రీడలతో మానసిక ఉల్లాసం పెంపొందుతుందన్నారు. నిత్యం పని వత్తిడిలో ఉండే డాక్టర్లు, పోలీసులు, రెవెన్యూ ,మీడియా వారు కొంతసేపు ఆహ్లాదకరంగా గడిపారన్నారు. ఈ విధంగా క్రికెట్ మ్యాచ్ కండెక్ట్ చేయడం ద్వారా ప్రతి ఒక్కరికి ఆట విడుపుతో పాటు మంచి టీమ్ స్పిరిట్ వస్తుందని అభిప్రాయపడ్డారు.

*Dr.-xi vs Police-xi* Police-xi won the toss ele to batting
Police-xi 158/4
1.Sateesh Sir 53 Runs 44balls
2.Gause Aalam sir 30Runs 28 balls
3.CP Sir 16Runs not out

Dr.-xi Bowling
1.Dr.Pardeep sir
4over 25 Runs 1 wicket
2.Dr.laxam sir
4over 25Runs 2wicket

*Dr.-xi125/10*
1.Dr.anil sir
55Runs 43balls
2.Dr.Ahsdhara sir15 Runs 25balls
3.Dr.Shashi sir 9 Runs
Police-xi bowling
1.Shyam sir 3-over-14Runs2wicket
2.Sateesh sir 3over 26Runs3Wickets
Police-xi won by 33Runs

Man of the match kusumanchi CI sateesh sir