Telugu News

రేపటి నుంచి వరద బాధితులకు  పరిహారం: మంత్రి పువ్వాడ

నేరుగా బాధితుల ఖాతాల్లోకి డబ్బులు జమ 

0

రేపటి నుంచి వరద బాధితులకు  పరిహారం: మంత్రి పువ్వాడ

== నేరుగా బాధితుల ఖాతాల్లోకి డబ్బులు జమ 

== సీఎం కేసిఆర్ హామీ మేరకు బాధితులకు సహాయం

==  వెల్లడించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

ఖమ్మంప్రతినిధి, జులై 30(విజయంన్యూస్)

భద్రాచలం వరద ముంపు బాధితుల పునరావాసానికి సీఎం కేసిఆర్ ప్రకటించిన రూ.10 వేల రూపాయల పరిహారం ఆగస్ట్ 1 నుంచి బాధితుల బ్యాంక్ ఖాతాలలో ప్రభుత్వం జమ చేస్తుందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వెల్లడించారు. ఈ మేరకు శనివారం మంత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. వరద బాధిత కుటుంబాలు ఒక్కింటికి 20 కిలోల, 5 కిలోల కందిపప్పు 2 నెలలపాటు ఉచితంగా ఇస్తామని, రూ.10 వేల తక్షణ ఆర్థిక సహాయాన్ని అందజేస్తామని సీఎం కేసిఆర్ భద్రాచలం పర్యటనలో హామీ ఇచ్చారని ఈ మేరకు బాధితులకు సహాయార్థం సేకరించిన వారి వివరాల ప్రకారం ప్రభుత్వం ఆర్ధిక సహాయాన్ని బ్యాంక్ ఖాతాలలో జమ చేయడం జరుగుతుందన్నారు. ఇప్పటికే బాధిత కుటుంబాలకు బియ్యం, కందిపప్పు పంపిణీ పూర్తయిందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. భద్రాచలం ప్రాంతంలో వరద ముంపు సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు సీఎం కేసిఆర్ రూ.1000 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారని, పట్టణ కాంటూరు లెవల్స్‌ను పరిగణనలోకి తీసుకొని వరద బాధితులకు ఎత్తైన ప్రదేశాల్లో కాలనీల నిర్మాణం చేపట్టాలని సూచించిన విషయాన్ని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గుర్తు చేశారు.

ఇది కూడా చదవండి : వరద బాధితులకు అండగా టి ఆర్ ఎస్ ప్రభుత్వం ఉంది. : నామా నాగేశ్వరరావు