Telugu News

పువ్వాడ ఎదురులేని నేత

ఆయన జన నేత

0

పువ్వాడ ది పొలిటికల్ బ్రాండ్‌.

వ్యాసకర్త : లలిత్ చౌదర

ఖమ్మం మీద అణువణువునా మమకారం లేకుండా ఈ స్థాయి ఆసక్తి, కృషి సాధ్యం కాదు. ఆ మమకారం అజయ్ కు అత్యంత సహజసిద్ధంగా కామ్రేడ్ పువ్వాడ నాగేశ్వరరావు నుంచి వచ్చిందనుకోవచ్చు. కానీ, దాన్ని ఊహించని ఎత్తులకు తీసుకుపోతూ, తండ్రికి పుత్రోత్సాహాన్ని కలిగిస్తూ, రాష్ట్ర స్థాయిలో పేరు ప్రఖ్యాతలు శ్లాఘించబడే స్థాయికి ఎదగడమన్నది పువ్వాడ అజయ్ కుమార్ వ్యక్తిగత సామర్థ్యం, నిరంతర కృషి కారణం గానే. సామర్థ్యం ముందు వారసత్వం అనే పదానికి అర్థం లేదు. అలాగే సామర్థ్యానికి వారసత్వం అనేది ఎప్పుడూ అడ్డు కాకూడదు. మంత్రి పువ్వాడ అజయ్ విషయంలో వారసత్వం అనేది కేవలం అతని పొలిటికల్‌ ఎంట్రీకి ఉపయోగపడిందనుకోవచ్చు. కాని, ఆ తర్వాతదంతా ఆయన స్వయంకృషే అన్నది ఎవ్వరైనా సరే ఒప్పుకొని తీరాల్సిన నిజం.

Allso read:- చిన్నారి అభినయశ్రీ వైద్యానికి మంత్రి పువ్వాడ సాయం

ప్రతి మంచి పని మీద ప్రతిపాదన పెట్టాం, అయితే అవుద్ది, లేకపోతే లేదన్న సాంప్రదాయిక శైలి. ఎందుకు కాదు, మనమెందుకు సాధించలేమన్న ప్రోయాక్టివ్‌ దృక్పథం అజయ్ ది. ఇంత డైనమిజమ్‌, ఇంత స్పష్టత, ఇలాంటి అత్యంత వేగవంతమైన భావవ్యక్తీకరణ, సందర్భం ఏదైనా సరే.. అలవోకగా ఎదుటివారిని మెస్మరైజ్‌ చేసే వ్యక్తి ఆయన. ఇంత పాజిటివ్‌ స్పిరిట్‌, ఇంత దూకుడు ప్రదర్శిస్తూ ముందుకుసాగిపోతున్నారు పువ్వాడ అజయ్ కుమార్

 

వ్యాసకర్త : లలిత్ చౌదరి