Telugu News

పల్లె ప్రగతితో శరవేగంగా అభివృద్ధి :మంత్రి

పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన

0

పల్లె ప్రగతితో శరవేగంగా అభివృద్ధి :మంత్రి

== రఘునాథపాలెంలో పర్యటించిన మంత్రి పువ్వాడ అజయ్

== పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన

రఘనాథపాలెం, జూన్ 18(విజయంన్యూస్)

పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాలు శరవేగంగా అభివృద్ధి చెందాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా శనివారం చివరి రోజున రఘునాథపాలెం మండలం చెరువుకొమ్ము తండా, వేపకుంట్ల గ్రామాల్లో పలు అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు. ఇందులో చెరువుకొమ్ము తండా గ్రామంలో రూ. 17 లక్షల రూపాయలతో నిర్మించిన సైడు కాల్వలు, సీసీ రోడ్లు (7 పనులు), వేపకుంట్ల గ్రామంలో రూ. 54.50 లక్షల రూపాయలతో నిర్మించిన సైడు కాల్వలు, సీసీ రోడ్లు (18 పనులు) వున్నాయి. ఈ సందర్దంగా వేపకుంట్ల గ్రామంలో జరిగిన గ్రామ సభలో మంత్రి మాట్లాడుతూ, ఈ నెల 3 నుండి 15 రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా పల్లె, పట్టణ కార్యక్రమం చేపట్టి, ప్రత్యెక పారిశుద్ధ్య కార్యక్రమం చేసినట్లు, అందరం కలిసికట్టుగా సమస్యల పరిష్కారం చేసుకున్నట్లు తెలిపారు. వర్షాకాలం వస్తుంది కాబట్టి, వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు వీధులు, కాల్వలు శుభ్రం చేసుకొని, పిచ్చి మొక్కలు, చెత్త తొలగించుకొని, వర్షాకాలం జాగ్రత్తలపై సన్నద్ధం కావడానికి ప్రణాళికలో భాగంగా పల్లె ప్రగతి కార్యక్రమం జరిగినట్లు మంత్రి అన్నారు.

allso read- పాలేరు నుంచే షర్మిల పోటీ : మంత్రి

తానూ మంత్రి అయిన తర్వాత కేవలం ఒక్క వేపకుంట్ల గ్రామంలోనే సిసి రోడ్లకు రూ. 1.10 కోట్లు ఖర్చు చేసినట్లు ఆయన అన్నారు. ఏ మాత్రం ఇంకనూ సిసి రోడ్ల నిర్మాణం మిగిలివున్న పూర్తిచేస్తామని ఆయన తెలిపారు. ఇజిఎస్, ఎమ్మెల్యే, సుడా నిధులతో రఘునాధపాలెం మండలంలో దాదాపు 12 కోట్ల రూపాయల సిసి రోడ్లు ప్రతి గ్రామంలో నిర్మాణం చేసుకున్నట్లు ఆయన అన్నారు. మండలంలో ఎక్కడైనా ఇంకా సిసి రోడ్ల ఆవశ్యకత వుంటే పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. సిసి రోడ్ల పూర్తితో బురద, అపరిశుభ్ర వాతావరణం ఉండదని, డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియాలు రావని, వర్షాకాలం ఇబ్బంది లేకుండా ఉంటుందని, రోడ్లను వూడ్చుకొని పరిశుభ్రంగా ఉంచుకోవాలని మంత్రి అన్నారు. శరవేగ అభివృద్ధితో భూములు బంగారం అయ్యాయని, సంపద విలువ పెరుగుతున్నదని, వ్యవసాయం మనకు ఆధారమని, భూములను అమ్ముకోవద్దని, భూములను ఉంచుకోవాలని, భూములను నమ్ముకోండి కాని, అమ్ముకోకండి అని మంత్రి అన్నారు. 17 గ్రామ పంచాయితీలు వున్న రఘునాధపాలెం మండలాన్ని 37 గ్రామ పంచాయతీలుగా చేసుకున్నామని, చిన్న తండాలు కూడా పురోగమించి, ప్రతి తండా గ్రామ పంచాయితీగా ఏర్పాటుచేసుకున్నట్లు, క్రొత్తగా ఏర్పడ్డ గ్రామ పంచాయితీలకు భవనాల నిర్మాణానికి ఒక్కొక్క భవనానికి రూ. 25 లక్షల చొప్పున మంజూరు అయినట్లు తెలిపారు. రైతు బంధు, రైతు భీమా, కళ్యాణలక్ష్మి, ఆసరా పెన్షన్లు తదితర సంక్షేమ పధకాలు కరోనా సందర్భంలో ఆర్థికంగా ఎంత ఇబ్బంది అయిన ఆపకుండా అందజేసినట్లు ఆయన తెలిపారు. జులై నుండి క్రొత్త పెన్షన్ల మంజూరు చేస్తామన్నారు. గ్రామంలో ట్యాంక్ బండ్ ఏర్పాటుకు రూ. 25 లక్షలు మంజూరుచేసినట్లు, పూర్తికి అదనపు నిధులు అవసరమైతే మంజూరుచేయనున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరికి అభివృద్ధి ఫలాలు అందజేస్తామని మంత్రి అన్నారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మొగిలి స్నేహలత మాట్లాడుతూ, ప్రగతి నిరంతర ప్రక్రియ అని, పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా ప్రత్యేక కార్యాచరణతో కార్యక్రమం చేపట్టినట్లు అన్నారు. పారిశుద్ధ్య సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆమె తెలిపారు. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాలు సమగ్రాభివృద్ధి చెందాయని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ కూరాకుల భూషణయ్య, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్ పర్సన్ లక్ష్మి ప్రసన్న, డిఆర్దివో విద్యా చందన, డిపివో హరిప్రసాద్, ఇఇ పిఆర్ శ్రీనివాస్, రఘునాధపాలెం ఎంపిడివో రామకృష్ణ, తహసిల్దార్ నరసింహ రావు, డిఎల్ఫివో పుల్లా రావు, జెడ్పిటిసి ప్రియాంక, సర్పంచులు దారాశ్యాం , మంగమ్మ, ఎంపిటిసి వనజారాణి, అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

allso read- కోలాటమేసిన మంత్రి పువ్వాడ