Telugu News

చెట్టును ఢీకొన్న ద్విచక్రవాహనం.. వ్యక్తి మృతి

వ్యక్తి మృతి.. కేసు నమోదు చేసిన పోలీసులు

0

చెట్టును ఢీకొన్న ద్విచక్రవాహనం

— వ్యక్తి మృతి.. కేసు నమోదు చేసిన పోలీసులు 

(ఖమ్మం రూరల్-విజయం న్యూస్)

మండలంలోని మద్దులపల్లి పంచాయతీ పరిధిలో గల కోదాడ క్రాస్ రోడ్ లో సోమవారం ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తి అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని పొన్నెకల్లు గ్రామానికి చెందిన నూతలపాటి నవీన్ (33) ఖమ్మం నుంచి పొన్నెకల్లు వెళుతుండగా కోదాడ క్రాస్ రోడ్ వద్ద చెట్టును ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.మృతునికి భార్య,ఇద్దరు పిల్లలు ఉన్నారు.రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

also read :- చౌటపల్లి వాగులో చిక్కుకున్న ట్రాక్టర్