Telugu News

ఖమ్మం రూరల్ లో మరో మండలాన్ని ఇవ్వండి : కందాళ

అసెంబ్లీలోని క్వచ్ఛన్ అవర్ లో ప్రభుత్వాన్ని కోరిన పాలేరు ఎమ్మెల్యే

0

ఖమ్మం రూరల్ లో మరో మండలాన్ని ఇవ్వండి : కందాళ
== అసెంబ్లీలోని క్వచ్ఛన్ అవర్ లో ప్రభుత్వాన్ని కోరిన పాలేరు ఎమ్మెల్యే
(కూసుమంచి-విజయంన్యూస్)
ఖమ్మం రూరల్ మండలంలో మరో మండలాన్ని ఇవ్వాలని, ఎంవి.పాలెం కేంద్రంగా నూతన మండలాన్ని ప్రకటించాలని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం అసెంబ్లీలో క్వచ్ఛన్ అవర్ కొనసాగుతుండగా స్పీకర్ ఆదేశాలమేరకు మాట్లాడిన పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి మరో నూతన మండల ఏర్పాటు కోసం ప్రభుత్వాన్ని కోరారు. ఖమ్మం రూరల్ మండలంలో సుమారు 80వేల జనాబా కల్గి ఉన్నారని అన్నారు. అలాగే కామంచికల్, దారేడు, పడమటతండా గ్రామాలు ఖమ్మం నియోజకవర్గంలోని రఘునాథపాలెం మండలంలో ఉన్నయని, కానీ ఓటింగ్ మాత్రం పాలేరు నియోజకవర్గంలో ఉన్నాయని, తద్వారా పాలన పరమైన ఇబ్బందులు వస్తున్నాయని తెలిపారు. అందుకే ఆ మూడు గ్రామ పంచాయతీలను ఖమ్మం రూరల్ మండలంలో కలిపి ఎం.వెంకటాయపాలెం కేంద్రంగా ఒక మండలాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఇదివరికే సీఎం కేసీఆర్ కు కూడా తెలియజేసీ నూతన మండలాన్ని ఏర్పాటు చేయాలని కోరడం జరిగిందన్నారు. ప్రభుత్వం ఖమ్మం రూరల్ ప్రజలపై విశ్వాసం ఉంచి రెండు మండలాలను ఏర్పాటు చేయాలని కోరారు. దీంతో పురపాలక, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు మాట్లాడుతూ పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి కోరిక మంచిదేనని, కచ్చితంగా పరిశీలిస్తామని తెలిపారు.

allso read  :2024లో ప్రజా ప్రభుత్వాన్ని స్థాపిస్తాం : పవన్ కల్యాణ్