Telugu News

ఖమ్మం టౌన్ లో కార్డన్ అండ్ సర్చ్

42 మోటర్ సైకిళ్లు, 3 ఆటోలు, మద్యంసీసాలు స్వాధీనం

0

ఖమ్మం టౌన్ లో కార్డన్ అండ్ సర్చ్ 

— రమణగుట్ట, వికలాంగుల కాలనీలో విస్తృత తనిఖీలు 

— 42 మోటర్ సైకిళ్లు, 3 ఆటోలు, మద్యం సీసాలు స్వాధీనం 

— సురక్షితమైన సమాజం కోసమే కార్డన్ అండ్ సర్చ్: డీసీపీ ఇంజరాపు పూజ

(ఖమ్మం క్రైం -విజయంన్యూస్)

ఖమ్మం నగరంలో పోలీసులు కార్డన్ అండ్ సర్చ్ కార్యక్రమాన్ని ముమ్మరంగా నిర్వహించారు.  పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ ఆదేశాల మేరకు అడిషనల్ డిసిపి సుభాష్ చంద్ర బోస్ ,టౌన్ ఏసీపీ అంజనేయులు ఆధ్వర్యంలో శనివారం తెల్లవారుజామున నగరంలోని రమణగుట్ట,వికలాంగుల కాలనీలో ఖమ్మం టౌన్ డివిజన్ పోలీసులు కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనుమానాస్పద వ్యక్తుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. సరైన ధ్రువ పత్రాలు లేని 42 ద్విచక్రవాహనాలు, 03 ఆటోలను, మద్యం సీసాలు స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ఈ సందర్భంగా డీసీపీ ఇంజరాపు పూజ మాట్లాడుతూ సురక్షితమైన సమాజం.. ప్రజల భద్రతకు భరోసా కోసమే కార్డన్ అండ్ సర్చ్ నిర్వహిస్తున్నట్లు డీసీపీ ఇంజరాపు పూజ అన్నారు. అసాంఘిక కార్యకలాపాలపై, పాత నేరస్తుల కదలికపై నిరతరం నిఘా ఉంటుందన్నారు. స్దానికంగా ఏలాంటి గొడవలకు పోకుండా ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో వుండాలని సూచించారు. నేరాల నివారణ చర్యలలో భాగంగా స్దానిక ప్రాంతాలలో ప్రజల స్వచ్ఛందంగా భాగస్వామ్యమై ముఖ్యమైన కూడలిల్లో సి‌సి కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మంత్రాలు ,పూజలతో అమాయక ప్రజలకు మాయ మాటలు చేప్తూ అక్రమ సంపాదనకు అలవాటు పడి మోసాలకు పాల్పడుతున్న మాయగాళ్ల మాటలు నమ్మి మోస పోవద్దని అన్నారు. అదేవిధంగా ఆన్లైన్ సైబర్ నేరగాళ్ల నుండి అప్రమత్తంగా వుండాలని, మీ బ్యాంక్ ఖాతా వివరాల కోసం వచ్చే కాల్స్, ఈమెయిల్స్ కు స్పందించవద్దని, ఏ బ్యాంక్ సిబ్బంది అయిన మీ కార్డ్ నంబర్, పిన్, ఓటిపి, సివివి వివరాలను ఎప్పుడూ అడగే ఆవకాశం లేదని గుర్తుంచుకోండి. ఒకవేళ అడిగితే వారు సైబర్ నేరగాళ్లని గుర్తించాలని అన్నారు. బ్యాంక్ రేటు కంటే తక్కువ వడ్డీ రేటుకు లోన్స్ ఇస్తామంటే అనుమానించాలన్నారు. అనుమతి లేని ప్రవేటు చీట్స్ ఫండ్స్ చేరి డబ్బులు పోగొట్టుకొవద్దని సూచించారు. మీ పిల్లలకు విద్య పట్ల మక్కువ పెంపొందించడానికి కృషి చేయాలని అన్నారు.

als0 read :-వ్యవసాయబావిలో వ్యక్తి మృతదేహం

ఈ కార్డెన్ అండ్ సెర్చ్ సందర్భంగా స్థానిక ప్రజలు పోలీస్ వారికి పూర్తి సహకారాన్ని అందించారని తెలిపారు. ఎలాంటి అత్యవసర సమయములో అయిన డయల్ 100 కు లేదా స్దానిక పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించాలని సమాచారం ఇచ్చిన వారి పేరు గోప్యంగా ఉంచబడుతుందని తెలిపారు. కార్డన్ అండ్ సర్చ్ లో ఖమ్మం టౌన్ ఏసీపీ అంజనేయులు, సిఐలు శ్రీధర్, సర్వయ్య, రామకృష్ణ , నవీన్ ,రవికుమార్ ,ఉదయ్ కుమార్ , ఎస్ ఐలు, మరియు70 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు .

అందుకు సంబంధించిన పోటోలు కింద చూడగలరు