Telugu News

జిల్లా అభివృద్ది జరిగింది టీఆర్ఎస్ హాయంలోనే : ఆర్ జేసీ కృష్ణ

వరంగల్ ప్రజాగర్జను జయప్రదం చేయాలి

0

జిల్లా అభివృద్ది జరిగింది టీఆర్ఎస్ హాయంలోనే 

— వరంగల్ ప్రజాగర్జను జయప్రదం చేయాలి

— నగర కార్యకర్తల సమావేశంలో టీఆర్ఎస్ జిల్లా ఆఫీస్ ఇన్ చార్జ్ ఆర్ జేసీ కృష్ణ 

(ఖమ్మం-విజయం న్యూస్)

టీఆర్ఎస్ హాయంలోనే ఖమ్మం జిల్లా అభివృద్ది జరిగిందని టీఆర్ఎస్ జిల్లా పార్టీ ఆఫీస్ ఇన్ చార్జ్ ఆర్ జే సీ కృష్ణ తెలిపారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శ్రీ పువ్వాడ అజయ్ కుమార్  ఆదేశాల మేరకు జిల్లా టిఆర్ఎస్ భవన్ లో నగర టిఆర్ఎస్ అధ్యక్షులు పగడాల నాగరాజు ఆధ్వర్యంలో నగర టిఆర్ఎస్ కమిటీ, అనుబంధ అధ్యక్షుల నాయకులతో సమావేశం జరిగింది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, స్వయం రాష్ట్రంలో తెలంగాణ ను,మన ఉమ్మడి ఖమ్మం జిల్లా ను అభివృద్ధి పరిచిన, అభివృద్ధి పరుస్తున్న ఘనత కేవలం టిఆర్ఎస్ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్కి, మంత్రులు యువనేత కేటీఆర్కి, పువ్వాడ అజయ్ కుమార్ కే దక్కిందన్నారు.

హైదరాబాద్ టిఆర్ఎస్ భవన్ లో టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  అధ్యక్షతన జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో యువ నేతల కేటీఆర్  ఇచ్చిన పిలుపుతో వరంగల్ ప్రగతి గర్జన సమావేశం విజయవంతం చేసేందుకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశాలతో ఖమ్మం నగరంలో డివిజన్ స్థాయి నాయకులతో సమావేశాలు నిర్వహించుకునేందుకుగాను నగర టిఆర్ఎస్ కమిటీ ఖమ్మం టిఆర్ఎస్ భవన్ లో విధివిధానాలు ఖరారు చేశారు.

 

నగర టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పగడాల నాగరాజు  అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన నగర మేయర్ నీరజ , suda చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ , రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  వ్యక్తిగత సహాయకుడు రవికిరణ్ పాల్గొని  ప్రగతి గర్జన బహిరంగ సభను విజయవంతం చేసేందుకు గాను నగర టిఆర్ఎస్ అధ్యక్షుడు పగడాల నాగరాజు కి, టిఆర్ఎస్ కమిటీ సభ్యులకు, అనుబంధ కమిటీ అధ్యక్షులకు పలు సూచనలు, సలహాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఖానాపురం హవేలి టిఆర్ఎస్ పార్టీ కన్వీనర్ కొనకంచి వరప్రసాద్, వన్ టౌన్ టిఆర్ఎస్ పార్టీ కన్వీనర్ జక్కుల లక్ష్మయ్య, టుా టౌన్ టిఆర్ఎస్ పార్టీ కన్వీనర్ మడుారి సైదారావు, త్రీ టౌన్ టిఆర్ఎస్ పార్టీ కన్వీనర్ వంగాల వెంకట్ , నగర టిఆర్ఎస్ కమిటీ సభ్యులు, ఖమ్మం నగర వివిధ అనుబంధ కమిటీ అధ్యక్షులు పాల్గొన్నారు.

ALSO READ: – మంత్రి పువ్వాడకు యువనేత ప్రశంస