Telugu News

వేటు పడేనా..!? వైదొలిగేనా…?! – మాజీ ఎంపీ పయనమెటు…?

ఆసక్తికరంగా "గులాబీ" గుట్టు

0

” సీను” మారితే ఛిద్రమే…!
– వేటు పడేనా..!? వైదొలిగేనా…?!
– మాజీ ఎంపీ పయనమెటు…?
– ఆసక్తికరంగా “గులాబీ” గుట్టు
– జిల్లా వ్యాప్తంగా సర్వత్రా చర్చ
(విజయం ప్రతినిధి – భద్రాద్రి కొత్తగూడెం జిల్లా)
చిరునవ్వే అతని సక్సెస్…! ఆప్యాయత తన అడ్రస్…! ఖమ్మం ఖిల్లా పై ఉవ్వెత్తున ఎగిసిన “రాజకీయ కెరటం”…! మెండుగా బంధు బలం, ప్రజాబలం కలిగిన ప్రజానేత…! ఒంటి చేత్తో జిల్లా రాజకీయాలను శాసించిన వ్యూహకర్త…! తననునమ్ముకున్నోళ్లకు ఓ గుండెచప్పుడు…! ఆయనే ఖమ్మం ఓ మాజీ ఎంపీ…! ఉభయ ఖమ్మం జిల్లాలో నేడు ఆయనదే హాట్ టాపిక్…! గుట్టుగా ఉన్న గులాబీ దళంలో… ఏదో పెద్ద” విప్లవమే ” సంభవించే ఛాన్స్ ఉందనే … ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి…! ” సీను” మారితే… గులాబీ ఇక ఛిద్రమే నన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది…. జిల్లా” గులాబీ గుట్టు” పై “విజయం ” పత్రిక అందిస్తున్న ప్రత్యేక కథనం….

ఉభయ ఖమ్మం జిల్లా ప్రస్తుతం గులాబీ మయం. బడా నేతలంతా కూడా గులాబీ జట్టులోనే ఉన్నారు.ఒకరిద్దరు నేతలు తప్ప జిల్లాలో ప్రతిపక్షమే లేదంటే ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. రాజకీయ చైతన్యంకు పెట్టింది పేరైన ఉభయ ఖమ్మం జిల్లాలో గులాబీ గత చాలా ఏళ్లుగా తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ వస్తోంది. వార్డ్ మెంబర్ ఎన్నిక మొదలుకొని ఎంపీ ఎన్నికల వరకు గులాబీ తన జైత్రయాత్ర కొనసాగిస్తూ వచ్చింది. అనేకమంది గంపెడు ఆశలు పెట్టుకొని తమ తమ పదవులను సైతం విడిచిపెట్టి గులాబీ గూటికి చేరారు. ఊహించని పరిణామంతో… గులాబీ గూడు నిండిపోయింది. ఉభయ ఖమ్మం జిల్లా గులాబీ గడిలో… ప్రస్తుతం ముగ్గురు పెద్ద తలకాయలు ఉన్నారు…. ఒకరు ఇప్పటికే మంత్రిగా పని చేయగా…. మరొకరు జిల్లాలో రాజ్యమేలుతున్నారు. మరో గులాబీ కీలక నేత, మాజీ ఎంపీ… పార్టీలో నామమాత్రంగా కొనసాగుతూ… ముందుకు సాగుతున్నారు. తన విధేయతతో ఎప్పటికైనా లక్ష్యాన్ని అధిగమిస్తాడు అనుకున్న ఆ నేతకు ఇటీవల జరుగుతున్న పరిణామాలు మింగుడుపడని ఇవ్వడంలేదు. రోజురోజుకు పార్టీలో అవమానాలు ఎదురవుటుండటంతో పార్టీలో ఆయన భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. ఈ క్రమంలో ఆ మాజీ ఖమ్మం ఎంపీ పయనం ఎటు అన్న చర్చలు జోరందుకున్నాయి.

allso read:- పాలేరు‘ కాంగ్రెస్ లో లొల్లి

మాజీ ఎంపీ పయనమెటు…?!

ఖమ్మం మాజీ ఎంపీ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్క అందంగా ఉండటంతో… ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. తమ ప్రియతమ నేత ఇక తాడోపేడో తేల్చుకోవాలని వారు ఆరాటపడుతున్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు మాజీ ఎంపీనే కారణమని… ప్రత్యర్థి వర్గాలు దుమ్మెత్తి పోసాయి. ఈ వ్యవహారం సీఎం వద్దకు కూడా వెళ్ళింది. మాజీ ఎంపీ కదలికలపై ఇంటిలిజెన్స్ వర్గాలు ఆరా తీశాయి. పూర్తి నివేదిక సీఎం వద్ద కూడా చేరినట్లు సమాచారం. జరుగుతున్న పరిణామాలపై మాజీ ఎంపీ… ఆసక్తిగా గమనిస్తున్నట్లు తెలుస్తోంది. ఏమి జరుగుతుందో…. వేచి చూసే ధోరణిలో పోతున్నట్లు సమాచారం. అంతర్గతంగా తన రాజకీయ భవిష్యత్తుపై ఆ మాజీ ఎంపీ స్పీడుగా పావులు కదుపుతున్నట్లు ప్రచారంలో ఉంది. పొమ్మనలేక పొగ పెట్టిన సందర్భంగా తెరాస పెద్దల వ్యవహారం ఉండటంతో… ఈ మాజీ ఎంపీ రాజకీయ భవిష్యత్తు నిర్ణయంపై… సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. తెరాస పెద్దలు ఈ మాజీ ఎంపీ పై వేటు వేస్తారా…? లేక మాజీ ఎంపీనే పార్టీకి గుడ్ బై చెప్తారా…? అన్నది ప్రశ్నార్ధకంగా మిగిలింది. ఒక ఎంపీ స్థానం తో పాటు, ముగ్గురు ఎమ్మెల్యేలను తీసుకొని టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న… ఈ మాజీ వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఖమ్మం మాజీ ఎంపీని తెరాస విడిచి పెట్టుకొని చేతులు కాల్చుకుంటుందా…?

allso read:- తెలంగాణ రైతుల‌పై బీజేపీ ప‌గ‌ : మంత్రి పువ్వాడ.

మాజీ మంత్రి, తాజా హుజురాబాద్ ఎమ్మెల్యే వ్యవహారంలాగా పార్టీకి ఇది మరో తలబొప్పిగా మారనుందా…? అన్న చర్చలు వేడెక్కాయి. సిట్టింగ్ టిక్కెట్ ను విడిచి పెట్టుకొని…. ఇన్నాళ్లు పార్టీకి విధేయులుగా ఉన్న ఈ మాజీ ఎంపీ… ఇక వేరే గూటికి పయనం కడతాడా… అన్న ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అదే జరిగితే…? ఏ పార్టీ కి వెళ్తారు…? అన్నది మిస్టరీగానే మిగిలింది. కాంగ్రెస్ చెంతకు చేరుతారా…? బిజెపిలోకి చేరి రక్షణ వలయంలోకి వెళ్ళిపోతారా…? వేచి చూడాల్సిందే. సాదాసీదా వ్యక్తి ఈ మాజీ ఎంపీ కాదని…. గతంలోనే తనంటే ఏంటో సత్తాచాటిన వాడిని, ఆర్థికంగా, హార్థికంగా తిరుగులేని వాడని, బలమైన తన కుల బలంతో పాటు, ప్రజాబలం ఉన్న నేత అని… ఈ మాజీ ఎంపీ తాజా నిర్ణయం ఏమిటో…? అంతుచిక్కని వ్యవహారంలో మిగిలింది. మరో కొద్ది రోజుల్లోనే… ఈ హై డ్రామాకు తెరపడనుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. రాష్ట్ర నేతలందరూ ఆతృతగా ఎదురుచూస్తున్న ఖమ్మం ఖిల్లా రాజకీయాలు “సీను” మారితే ఛిద్రమేనని సంకేతాలు వెలువడుతున్నాయి.

allso read :- రైతు రాజ్యం కాంగ్రెస్ తోనే సాధ్యం: సీఎల్పీ నేత భట్టి