Telugu News

ఖమ్మం ఖిల్లాపై గులాబీ జెండా ఎగరేద్దాం: మంత్రి

మాపై నమ్మకం ఉంచి పదవిచ్చిన సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు : గాయత్రి రవి, పార్థసారథిరెడ్డి

0

ఖమ్మం ఖిల్లాపై గులాబీ జెండా ఎగరేద్దాం: మంత్రి

== పది స్థానాలే లక్ష్యంగా పనిచేద్దాం

== అందరు ఐక్యంగా ఉంటే 10స్థానాలు సీఎం కేసీఆర్ కు గిప్ట్ ఇచ్చినట్లే

== హ్యాట్రిక్ సాధించేందుకు మనమంతా కంకణబద్దులై పనిచేయాలి

== మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కార్యకర్తలకు పిలుపు

== రెండు రాజ్యసభ స్థానాలను ఖమ్మం కేటాయించడం పట్ల సీఎంకు ధన్యవాదాలు

== టీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా మారింది : నామా

== రాబోయేది టీఆర్ఎస్ ప్రభుత్వమే : తుమ్మల

== మాపై నమ్మకం ఉంచి పదవిచ్చిన సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు : గాయత్రి రవి, పార్థసారథిరెడ్డి

ఖమ్మం ప్రతినిధి,జూన్ 18(విజయంన్యూస్)

మరోసారి ఖమ్మం ఖిల్లాపై గులాబీ జెండాను ఎగరేద్దామని, ఉమ్మడి జిల్లాలో పదికి పది స్తానాలే లక్ష్యంగా పనిచేయాల్సిన అవసరం ఎంతైన ఉందని రాష్ట్ర రవాణాశాఖమంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పార్టీ శ్రేణులను, నాయకత్వాన్ని కోరారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి రాజ్యసభకు ఎంపికైన వద్దిరాజు రవిచంద్ర(గాయత్రి రవి), డాక్టర్ బండి పార్థసారథిరెడ్డి ఎంపీలుగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా ఖమ్మం విచ్చేసిన సందర్భంగా సర్దార్ పటేల్ స్టేడియం నందు నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఅర్ కి కృతజ్ఞత సభ, ఎంపిల అభినందన సభలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హాజరై మాట్లాడారు.. ఖమ్మం జిల్లాకు ఒకేసారి రెండు ఎంపి పదవులు ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఅర్ కి  మంత్రి పువ్వాడ కృతజ్ఞతలు తెలిపారు. వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథి రెడ్డి పూలమొక్కలు అందజేసి, శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లడుతూ..వద్దిరాజు రవిచంద్రకి, ఇలాంటి అభినందన సభను మళ్ళీ రెండున్నరఏళ్ల తరువాత  నిర్వహించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం రెండున్నర.. ఆ తరువాత మళ్ళీ ఆరేళ్లు మొత్తం ఎనిమిదిన్నరఏళ్లు రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు.

allso read- ఖమ్మంలో ఎంపీలకు అడుగడుగున నిరాజనం

అలా రావాలంటే మన పార్టీని ముచ్చటగా మూడవసారి అధికారంలోకి తీసుకు వచ్చి కేసీఅర్ ని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవటం ద్వారా ఈ అవకాశం వస్తుందని పిలుపునిచ్చారు.ఇప్పటి వరకు ఆయా రంగాల్లో ప్రజలకు సేవలు అందిస్తున్న గాయత్రి రవి, బండి పార్థసారథి రెడ్డి లను ప్రజాసేవలో మరింత ఎక్కువగా ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు తెలిపారు. ఖమ్మం జిల్లాకు రెండు ఎంపి పదవు

లు ఒకేసారి కల్పించడం పట్ల మనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. ఖమ్మం జిల్లాలో తెరాస పార్టీకి తిరుగులేదని నిరూపిస్తామన్నారు. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి 10కి పది స్థానాలు గెలవడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. అది సాధ్యం కావాలంటే కొత్త, పాత, సీనియర్, జూనియర్ అనే బేదాలు లేకుండా కలిసికట్టుగా పనిచేయాలి. తద్వారా ఖమ్మంలో అన్ని స్థానాలను గెలవడమే కాకుండా టీఆర్ఎస్ పార్టీని మూడవ సారి అధికారంలోకి తీసుకవచ్చినవారమవుతామని అన్నారు. ఖమ్మం ఎంపీ, పార్లమెంటరీ పార్టీ నాయకుడు  నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ పదవుల విషయంలో ఖమ్మం జిల్లాకు సముచిత స్థానం కల్పించడంలో సీఎం కేసీఆర్ ముందున్నారని, ఇంత పోటీ పరిస్థితుల్లో కూడా ఖమ్మం జిల్లాకు రెండు రాజ్యసభ పదువులను ఇవ్వడం అనేది చాలా గడ్స్ అవసరమని అన్నారు.

allso read- అగ్నిపథ్ ను తక్షణమే ఉపసంహరించుకోవాలి : మంత్రి పువ్వాడ

సీఎం కేసీఆర్ దమ్మున్న అభ్యర్థి కావడమే ఇలాంటి గొప్ప అవకాశాలు వస్తున్నాయని అన్నారు. ఖమ్మం జిల్లాలో ఇప్పటికే తిరుగులేని పార్టీగా ఉండేదని, ఇప్పడుకొంత బలమోచ్చిందని, ఇక టీఆర్ఎస్  పార్టీకి తిరుగులేదన్నారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఖమ్మంజిల్లాకు రెండు రాజ్యసభ స్థానాలను కల్పించడేమే కాకుండా సత్తుపల్లి నియోజవర్గం నుంచి పార్థసారథిరెడ్డికి క టాయించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అందుకుగాను సీఎం కేసీఆర్ కు  కృతజ్ఞతలు తెలిపారు. అలాగే గాయత్రి రవి, పార్థ సారథిరెడ్డి మాట్లాడుతూ తమపై నమ్మకం ఉంచి కేంద్రంలోని పేద్దల సభకు మమ్మల్ని పంపించడం చాలా సంతోషంగా ఉందన్నారు. వారి నమ్మకాన్ని నిలబెట్టేందుకు తమ వంతు ప్రయత్నం ఉంటుందన్నారు. ఇంతటి చక్కటి అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్ కు, మంత్రి కేటీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం రాజ్యసభ సభ్యులను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, వేదికపై ఉన్న అతిథులందరు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, తాతామధుసూధన్, ప్రభుత్వ విఫ్ రేగా కాంతారావు, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కందాళ ఉపేందర్ రెడ్డి, రాములు నాయక్, వనమా వెంకటేశ్వరరావు, హరిప్రియ, మెచ్చా నాగేశ్వరరావు, జడ్పీచైర్మన్లు లింగాల కమల్ రాజు, కోరం కనకయ్య, మదన్ లాల్, కొండబాల కోటేశ్వరరావు, నల్లమల వెంకటేశ్వరరావు, ఖమ్మం నగర మేయర్ పూనకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ తదితరులు  హాజరైయ్యారు.