Telugu News

ఖమ్మం నగరంలో కాంగ్రెస్ కు బిగ్ షాక్..

కాంగ్రెస్ నుండి తెరాసలో చేరనున్న కార్పొరేటర్ లు, సర్పంచ్

0

*ఖమ్మం నగరంలో కాంగ్రెస్ కు బిగ్ షాక్..*

** కాంగ్రెస్ నుండి తెరాసలో చేరనున్న కార్పొరేటర్ లు, సర్పంచ్..*

** హైదరాబాద్ బయలుదేరిన శ్రేణులు

**నేడు మంత్రి సమక్షంలో టీఆర్ఎస్ లో చేరిక
(ఖమ్మం కార్పోరేషన్-విజయం న్యూస్)

ఖమ్మం నియోజకవర్గంలో కాంగ్రెస్ కు బిగ్ షాక్ తగలనుంది.. ఇటీవలే కాంగ్రెస్ లో చేరి కార్పోరేటర్లుగా గెలిచిన కొందరు కార్పోరేటర్లు అతికొద్ధి రోజులలోనే కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు. మున్సిపల్ కార్పోరేషన్ కు చెందిన కాంగ్రెస్ కార్పొరేటర్ లు మోతారపు శ్రావణి(55వ డివిజన్), ధానాల రాధ(17వ డివిజన్), రఘునాధపాలెం మండలం బుడిదంపాడు గ్రామ సర్పంచ్ మీరా(కాంగ్రెస్)తో పాటు కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ మేరకు నేడు హైదరాబాద్ నందు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో తెరాస పార్టీలో చేరనున్నారు. ఈ సందర్భంగా ఖమ్మం వీడియోస్ కాలనీలోని మంత్రి క్యాంపు కార్యాలయం నుండి హైదరాబాద్ కు బయలుదేరిన మేయర్ పునుకొల్లు నీరజ, సూడా చైర్మన్ విజయ్ కుమార్, పార్టీ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, జిల్లా పార్టీ కార్యాలయ ఇంచార్జి ఆర్ జేసీ కృష్ణ, మంత్రి పీఏ.రవికిరణ్ పలువురు నాయకులు ఉన్నారు. అయితే ఈ విషయంపై కాంగ్రెస్ నాయకులు పెదవివిప్పడం లేదు..

All so read:- వనమా రాఘవ నా భార్యను కోరాడు.. ఎలా పంపగలను?: రామకృష్ణ సెల్ఫీ వీడియో వైరల్